Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఇండిపెండెన్స్ డే ట్రీట్

Raja-The-Great

రవితేజ కొంతకాలం గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’. గత ఏడాది ఈ స్టార్ హీరో నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దీంతో ప్రస్తుతం అతను చేస్తున్న ఈ చిత్రంపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ అభిమానులకు స్వాతంత్ర దినోత్సవ కానుక ఇవ్వనున్నాడు. ఆగస్టు 15న ‘రాజా ది గ్రేట్’ చిత్రం టీజర్ విడుదలకానుంది. అయితే ఈ సినిమాలో రవితేజ కంటిచూపు లేని వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఇలాంటి పాత్రలో కనిపించడం అతని కెరీర్‌లో ఇదే తొలిసారి. అంధుడి పాత్రలో రవితేజ ఈ చిత్రంలో ఎంతో డిఫరెంట్‌గా కనిపించబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తిస్థాయి వినోదభరిత చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. డార్జిలింగ్, హైదరాబాద్‌లలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Comments

comments