Home సినిమా చుట్టూ జనం మధ్యలో మనం

చుట్టూ జనం మధ్యలో మనం

Ravi Teja starrer 'Nela Ticket' gets a release date

స్టార్ హీరో రవితేజ సినిమాలు కుటుంబం మొత్తం చూసేలా ఉంటాయి. ఆయన సినిమాల్లో కామెడీ, యాక్షన్, వెటకారపు డైలాగులతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి. దీంతో కుటుంబమంతా కలిసి సరదాగా రవితేజ సినిమాలు చూడవచ్చు. ఇక దర్శకుడు కల్యాణ్‌కృష్ణ తీసింది రెండు సినిమాలే అయినా తనకంటూ ఒక క్లాస్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. మంచి కథా కథనంతో సరదాగా సాగిపోతూ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండించే సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు రవితేజతో ‘నేల టిక్కెట్టు’ తీస్తున్నారు. ఒక మాస్ హీరో, ఒక క్లాస్ దర్శకుడు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది? దీనికి సమాధానంగా ‘నేల టిక్కెట్టు’ ట్రైలర్ వచ్చేసింది. ‘చుట్టూ జనం మధ్యలో మనం… అది కదరా లైఫ్’, ‘ఎంతమంది కష్టాల్లో ఉన్నారో చూడరా… కానీ సాయం చేసే వాడు ఒక్కడు లేడు’, ‘ముసలితనం అంటే చేతకానితనం కాదురా… నిలువెత్తు అనుభవం’ వంటి అద్భుతమైన, అర్థవంతమైన కళ్యాణ్‌కృష్ణ మార్కు క్లాస్ డైలాగులతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ‘నువ్వు రావటం కాదు నేనే వస్తున్నా… ఇదే మూడ్ మెయిన్‌టైన్ చెయ్’, ‘నేల టిక్కెట్టు గాళ్లతో పెట్టుకుంటే… నేల నాకించేస్తారు’ వంటి ఈలలు వేయించే రవితేజ మార్కు మాస్ డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాను క్లాస్, మాస్, ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీశారని తెలిసిపోయింది. ఈ నెల 25న విడుదలకానున్న ఈ సినిమాను ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాష్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్న పూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖవాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణంః ముఖేష్, సంగీతం ః శక్తికాంత్ కార్తీక్, కూర్పుః ఛోటా కె.ప్రసాద్, కళః
బ్రహ్మ కడలి.