Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

మూడు భిన్నమైన గెటప్స్‌లో..

Ravi-Teja

రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ఫస్ట్‌లుక్‌లో హీరో పాత్రను మూడు భిన్నమైన గెటప్స్‌లో చూపించారు. రవితేజ కూడా తొలిసారి తన కెరీర్‌లో ఇలా భిన్నమైన కోణాలున్న పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనువైట్ల గత సినిమాలకు పూర్తి భిన్నంగా సరికొత్త జోనర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సునీల్, లయ, వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతోంది. సెప్టెంబర్‌లో షూటింగ్ పూర్తికానుంది. ఎస్‌ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా విజయ్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రానికి ఎడిటర్‌ః ఎం.ఆర్.వర్మ, పాటలుః రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్‌ః ఏ.ఎస్.ప్రకాష్.

Comments

comments