Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

‘సితార’ షూటింగ్ పూర్తి

Ravi Babuవిలక్షణ నటుడు రవిబాబు, నవనీత్‌కౌర్ జంటగా ‘సితార’ సినిమా షూటింగ్‌పూర్తయింది. జి.ఎల్.సురేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్‌స్పీడ్‌తో కొనసాగుతోంది. ఊటి, కొడైకెనాల్, హైదరాబాద్, పొల్లాచ్చిలో సినిమా షూటింగ్ జరిగింది. సినిమాలోని హై ఓల్టేజ్ క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతో థ్రిల్‌నిస్తుందట. ఈనెల చివరి వారంలో సినిమాను విడుదల చేయాలని ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్‌చేశారు. డిఎస్ రవికుమార్ ఈ చిత్రానికి నిర్మాత. జీవాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీత దర్శకుడు.

Comments

comments