Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

స్వగ్రామానికి చేరుకున్న రవీందర్ మృతదేహం

Ravindhar dead body reaches native village
శాయంపేట: శాయంపేట మండల కేంద్రానికి చెందిన గట్టు రవీందర్ (42) బ్రతుకుదెరువు కోసం మలేషియాకు వెళ్లి గ్యాస్ ప్రమాదంలో ఆగస్టు 13న మృతి చెందాడు. ఆరు రోజుల తర్వాత మలేషియాలో పని చేస్తున్న ఎన్నారై చిట్టుబాబు చొరువతో శుక్రవారం మలేషియా నుంచి హైదరాబాద్‌కు పంపారు. హైదరాబాద్ నుంచి అంబులెన్స్‌లో శనివారం ఉదయం రవీందర్ ను స్వగ్రామమైన శాయంపేటకు తరలించారు. రవీందర్ మృతదేహం రావడంతో కుటుంబ సభ్యులు, బందువుల రోధనలు మిన్నంటాయి. మండల కేంద్రానికి చెందిన రవీందర్ భార్య శ్రీలత, కూతురు నాగశ్రీ, కుమారుడు నాగరాజులతో శాయంపేటలో గౌడ వృత్తి చేసుకుంటు, భార్య బిడిల పని చేసుకుంటు కుటుంబ సభ్యులను పోషించేవాడు.

గౌడ వృత్తిలో తగినంత ఆధాయం లేకపోవడంతో కుటుంబ పోషణ భారమై స్నేహితుడైన బీమారపు వీరస్వామి ద్వారా 2013లో మలేసియాకు వెళ్లాడు. మలేసియాలోని క్లాంగ్ సెలంగీయా ప్రాంతంలోని ఐస్ కంపెనీలో పనికి కుదిరాడు. ఆగస్టు 13న ఐస్ కంపెనీలో అమోనియ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక రవీందర్ మృతి చెందాడు. శనివారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగింది. రవీందర్ మృతదేహన్ని టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రవీందర్, ఎంపిటిసి కందగట్ల రవి సందర్శించి పూలమాలుల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Comments

comments