Home తాజా వార్తలు భారత క్రికెట్ కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు

భారత క్రికెట్ కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు

ravishastriన్యూఢిల్లీ : భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్లు జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం దరఖాస్తు ఫామ్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కి అందజేసినట్లు తెలిపారు. ‘అవును ఈరోజు ఉదయం చీఫ్ కోచ్ పదవికి ఆప్లై చేశా. కోచ్ పదవి కోసం ఇచ్చిన ప్రకటనలో ఏమైతే అడిగారో దాన్ని ఈ-మెయిల్ ద్వారా బోర్డుకు అందజేశా. ఇంకా బీసీసీఐ ఏమైనా కోరితే వాటిని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అయితే ఈ పదవిపై మీరు నమ్మకంగా ఉన్నారా?లేరా?అని అడిగితే అది నా చేతుల్లో లేదు. నా పని దరఖాస్తు చేయడం మాత్రమే. ఆపై ఇంక ఎటువంటి కామెంట్లు చేయదలుచుకోలేదు’ అని రవిశాస్త్రి తెలిపాడు.