Home అంతర్జాతీయ వార్తలు షరీఫ్ హత్యకు ‘రా’ కుట్ర : పాక్

షరీఫ్ హత్యకు ‘రా’ కుట్ర : పాక్

nawazshareefఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను, జమాత్ ఉద్ దవా (జెయుడి) అధినేత హఫీజ్ మహమ్మద్ సయీద్‌లను హత్య చేసేందుకు భారత్ కుట్రపన్నిందని పాకిస్థాన్ నిఘా సంస్థ ఆరోపించింది. దేశంలో భారీ ఎత్తున గందరగోళం సృష్టించేందుకు భారత నిఘా సంస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ విభాగం (రా) కుట్ర పన్నిందని పేర్కొంది. ప్రధాని, హఫీద్ హత్య బెదిరింపుల నేపథ్యంలో భద్రత దళాలు హై అల ర్టుగా ఉండాలని ఆదేశాలు అందాయని గురువారం పంజాబ్ హోంశాఖ తెలిపింది. పాకిస్థాన్‌లో భారీగా అల్లర్లు సృష్టించేందుకు, ప్రధాన నాయకుల హత్యలు చేసేందుకు రా ప్రణాళికలు రచించడం వాస్తవమని’ పంజాబ్ హోంశాఖ విడుదల చేసిన లేఖలో పేర్కొంది. ఇటీవల ఉగ్రవాద చర్యలకు ప్రతిచర్యగా రా అధికా రులు ప్రణాళికలు వేశారని, ప్రతీకార దాడులు చేసేందుకులష్కరే-ఇ-జంగ్వీ (ఎల్‌ఇజె), తెహ్రీక్-ఇ-తాలి బన్ పాకిస్థాన్ (టిటిపి)వంటి అతివాద సంస్థలను పురికొల్పుతున్నారని ఆరోపించింది. పంజాబ్‌లోని హఫీజ్ సయీద్ వివరాలను సేకరించేందుకు భారత నిఘా సంస్థ ఆయా వర్గాలకు అప్పగించిందని ఆరోపించారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి హత్య వంటి ప్రధాన ఘర్షణల ద్వారా దేశంలో అలజడిని సృష్టించేందుకు ప్రణాళి కలు వేసిందని లేఖ పేర్కొంది. దీంతో నవాజ్‌కు భద్రత పెంచారు.