Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

భారత విదేశీ మారక నిల్వ 352 బిలయన్ డాలర్లు

Rbi234ముంబయి : సెప్టెంబర్ 18 నాటికి భారత విదేశీ మారక (ఫోరెక్స్) నిలువలు 352.02 బిలియన్ డాలర్‌లకు చేరుకుందని శుక్రవారం అధికార నివేదక పేర్కొంది. సెప్టెంబర్ 11 వారాంతానికి నిల్వలు 2.35 బిలియన్ డాలర్‌లు పెరిగి ఫోరెక్స్ నిల్వల మొత్తం 351.38 బిలియన్ డాలర్‌లు చేరుకుంది. సెప్టెంబర్ 4 వారాం తంలో ఫోరెక్స్ నిల్వలు 2.88 బిలియన్ డాలర్‌లు పడిపోయి 349.03 బిలియన్ డాలర్‌లకు పడిపోయింది. ఆర్‌బిఐ ఇచ్చిన వారాంతపు గణాంక అనుబంధ నివేదిక ప్రకారం విదేశీ కరెన్సీ నిల్వలు (ఎఫ్‌సిఎ)లు 328.56 మిలియన్ డాలర్‌ల నుండి 592.7 మిలియన్ డాలర్‌లు చేరుకుంది. ఎఫ్‌సిఎలో అతి పెద్ద భాగం ఫోరెక్స్ నిల్వలు ఉంటాయి. ఎఫ్‌సిఎలో విదేశాలకు చెందిన అమెరికా డాలర్‌లు, డాలర్ కాని కరెన్సీలు, సె క్యూరిటీలు, బాండ్‌లు ఎక్కువగా ఉంటాయి. ‘ఎఫ్‌సిఎలు అమెరికా డాలర్ పరిభాషలో తెలుపబడుతాయి. దా ని పెరుగుదల, తరుగుదలను అమెరికా కరెన్సీలో కాకుండా పౌండ్ స్టెర్లింగ్, యూరో, యెన్‌ల పరిభాషలో కూడా తెలుపబడుతుందని’ ఆర్‌బిఐ తన గణాంక అనుబంధంలో పేర్కొంది. దేశంలోని బంగారం రిజర్వు నిల్వలు నిలకడగా ఉన్నట్లు వారాంతపు రివ్యూలో తేలింది. దేశంలోని బంగారం నిల్వలు 214.8 మిలియన్ క్షీణించి, సెప్టెంబర్ 4 వారాంతానికి 18.03 బిలియన్ డాలర్‌లకు చేరుకుంది.

Comments

comments