Search
Sunday 23 September 2018
  • :
  • :

ఆర్‌బిఐ అనుమతి పొందిన పేటిఎం

paytmన్యూఢిల్లీ: మొబైల్ వ్యాలెట్ పేటీఎం చెల్లింపు బ్యాంకును ప్రారంభించేందుకు ఆర్‌బిఐ అను మతి ఇచ్చింది. ఆర్‌బిఐ నుంచి అనుమతి లభిం చిందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ప్రకటించారు. ఆర్‌బిఐ(భారతీయ రిజర్వ్ బ్యాంకు) నుంచి ఇటీవల టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా చెల్లింపు బ్యాంకు అనుమతిని పొందిన విషయం తెలిసిందే. పేటిఎంకు చెల్లింపు బ్యాంకుగా 2015లోనే ఆమోదం లభించినప్పటి కీ దానికి అవసరమైన కార్యకలాపాలు పూర్తి చేయలేక రెండుసార్లు విఫలమైంది. ప్రస్తుతం ఆర్‌బిఐ అనుమతి లభించింది.
ఎయిమ్స్ భాగస్వామిగా మొబిక్విక్
నగదు రహిత చెల్లింపులకుగాను ఢిల్లీలోని ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు డిజిటల్ పేమెంట్ల సంస్థ మొబిక్విక్ భాగస్వామిగా ఉండనుంది. కంపెనీ మొబైల్ వ్యాలెన్‌ను వినియోగించడం ద్వారా వైద్యులు, సిబ్బంది, రోగులకు క్యాష్‌లెస్ పేమెం ట్లను అందించనుంది. ప్రముఖ వైద్య సంస్థ ఎయి మ్స్ ప్రతి రోజూ 25 వేల మంది రోగులకు సేవలందిస్తుంది. నగదు కొరత సమస్య నేపథ్యం లో భారతీయులకు తాము సహకారం అంది స్తున్నందుకు ఎంతో గర్విస్తున్నామని, దేశంలోనే ఎంతో పేరుగాంచిన వైద్య సంస్థ ఎయిమ్స్‌కు సేవలందించే అవకాశం రావడం తమకు సంతో షాన్నిచ్చిందని మొబిక్విక్ సహ వ్యవస్థాపకుడు ఉపాసన టాకు అన్నారు.

Comments

comments