మన తెలంగాణ/ హైదరాబాద్: ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం ఉదయం హైదరాబాద్కు రానున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డి), పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డి అండ్ పిఆర్ ఆడిటోరియంలో జరుగనున్న జాతీయ సదస్సును ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్లు.ఆర్.రెడ్డితో కలిసి ఆయన ప్రారంభిస్తారు. గ్రామీణ ఆర్థిక పరిస్థితిపై జాతీయ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన హైదరాబాద్లోని ఆర్బిఐ కార్యాలయాన్ని సందర్శిస్తారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ డైరెక్టర్లకు ఒక్క రోజు శిక్షణా కార్యక్రమంలో బ్యాంకుల్లో సుపరిపాలన విధానాలను పటిష్ఠం చేసుకోవడం, బ్యాంకు నాయకత్వంలో లోతైన మార్పులపై అవగాహన కల్పించనున్నారు. ఎన్ఐఆర్డి క్రక్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఆంధ్రాబ్యాంక్, ఎస్బిహెచ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ సహా పలు బ్యాంకులకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొననున్నారు. ఐఆర్డిఏ, పిఎఫ్ఆర్డిఏ ఛైర్మన్లు కూడా హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. అయితే రాజన్ సోమవారం సాయంత్రం 6.10 గంటలకు తిరిగి వెళతారు.