Home తాజా వార్తలు డి-స్ట్రీట్ తుడిచిపెట్టేసింది

డి-స్ట్రీట్ తుడిచిపెట్టేసింది

2018 లాభాలను డి-స్ట్రీట్ తుడిచిపెట్టేసింది

మార్కెట్ సమీక్ష

bs

ముంబై: రూపాయి(74 / డాలర్) దారుణ పతనం, ఇతర కారణాలతో స్టాక్‌మార్కెట్ రక్తమోడింది. ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రెపో రేటు 6.5 శాతం వడ్డీ రేటు యథాతథం, అధిక ముడి చమురు ధరలు, ఎక్సైజ్ సుంకంలో రూ .1.5 కోత వంటివి మార్కెట్లను కుప్పకూల్చాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 2018లో వచ్చిన లాభాలను తుడిచిపెట్టేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ వరుసగా 2000, 700 పాయింట్లు లాభాలను ఈ ఏడాదిలో సాధించగా, గత వారం రోజుల్లోనే ఈ లాభాలన్నీ ఆవిరయ్యాయి. దాదాపు అన్ని సెక్టార్ సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఎన్‌బిఎఫ్‌సిలో ద్రవ్యలభ్యత ఆందోళనలు, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సమస్యలు, మరింతగా రూపాయి విలువ తగ్గుదల, పెరుగుతున్న ముడి చమురు ధరలు, ట్రేడింగ్ టారిఫ్ యుద్ధం వంచి వచ్చే రోజుల్లో దేశీయ మార్కెట్లను అతలాకుతలం చేశాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు వచ్చే వారం టిసిఎస్‌తో ప్రారంభమవుతాయి. దీని ప్రకారం, మార్కెట్ ముందుకు సాగుతుంది. మార్కెట్‌ను కుప్పకూల్చడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో వారాంతం శుక్రవారం సెన్సెక్స్ 792 పాయింట్లు పతనమైంది. 34376.99 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్‌బిఐ యథాతథ విధానాన్ని ప్రకటించడంతో పాటు ఆయిల్‌రంగ షేర్ల భారీ పతనమయ్యాయి. సెన్సెక్స్ 792 పాయింట్లు నష్టపోయి 34,377 వద్ద, నిఫ్టీ సూచి 283 పాయింట్ల నష్టంతో 10,316 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఇలో ఒక్క ఐటి మినహా అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాలతో ముగిశాయి. అధికంగా ప్రభుత్వరంగ బ్యాంకు ఇండెక్స్ 4.50శాతం నష్టపోయింది. కీలకమైన బ్యాంకు నిఫ్టీ సూచి 375 పాయింట్ల నష్టపోయి 24,443 వద్ద స్థిరపడింది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైంజ్ సుంకాలను తగ్గిస్తూ ఆర్థిక మంత్రి జైట్లీ చేసిన ప్రకటనతో శుక్రవారం ట్రేడింగ్‌లోనూ ఆయిల్ షేర్లు కుప్పకూలాయి. ప్రధాన కంపెనీలైన బిపిసిఎల్, హెచ్‌సిఎల్, ఐఒసి, ఒఎన్‌జిసి షేర్లు భారీగా నష్టపోయాయి. ఒఎన్‌జిసి ఆరేళ్ల కనిష్టానికి, బిపిసిఎల్ రెండున్నరేళ్ల కనిష్టానికి చేరాయి. ఇక ఐఒసి రెండేళ్ల కనిష్టానికి, హెచ్‌పిసిఎల్ ఏడాదిన్నర కనిష్టానికి చేరుకున్నాయి.
80 శాతం పడిపోయిన స్మాల్, మిడ్ క్యాప్
ఈ మార్కెట్ల పతనం స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ షేర్లను పాతాళానికి పడేసింది. స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ షేర్లను 80 శాతం పడిపోయాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి.- అంతర్జాతీయంగా మార్కెట్లు, అమెరికా వడ్డీ రెట్లు పెరగడం, డాలర్ మరింత బలపడటం మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. -ముడి చమురు బ్యారెల్ ధరలు పెరగడం, ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు ఇవి కూడా మార్కెట్ ఒడుదిడుకులకు మరో కారణమని చెప్పవచ్చు.డాలర్ తో రూపాయి మారకపు విలువ పడిపోవడం, వడ్డీ రేట్లు పెరగడం, కొద్ది నెలల్లో దేశంలోని నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండడమూ ప్రభావం చూపాయి. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌లో బ్యాంకుల మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు పేరుకుపోవడం మార్కెట్లను నిరాశపరుస్తున్నాయి. దీంతో స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు పతనం బాట తప్పడం లేదు.
ఆర్‌బిఐ వడ్డీ రేటు పోటు
ఆర్‌బిఐ ఈసారి వడ్డీ రేటు 6.5 శాతాన్ని యథాతథంగానే కొనసాగించింది. ఇది అంచనాలను భిన్నంగా ఉండడం, విశ్లేషకుల అంచనాలకు విరుద్ధంగా ఉండడంతో రూపాయి పతనమైంది. అలాగే సూచీలు భారీగా పడిపోయాయి. చమురు ధరల పెరుగుదల, మార్కెట్లలో ఒడిదుడుకులు, అంతర్జాతీయంగా ప్ర తికూల పరిస్థితులు దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణానికి ప్రమాదకరమని హెచ్చరించింది. ఆర్‌బిఐ సమీక్షలో 0.25 శాతం మేర వడ్డీరేటును పెంచవచ్చ ని అం చ నా వేశారు. కానీ ఆర్‌బిఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచేందుకే మొ గ్గు చూ పింది. ప్రస్తుతం రేపో రేటు 6.5 శాతం వద్ద ఉండగా, రివర్స్ రేపో రేటు 6.25 గానే ఉంది. మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం లక్షం 4 శాతాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నామని ఎంపిసి స్పష్టం చేసింది. అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను 3.8 శాతానికి పెంచింది. ప్రస్తుత ఆర్థి క సంవత్సరానికి జిడిపి వృద్ధి రేటు అంచనాను 7.4 శాతంగా కొనసాగించింది.
పెను ప్రభావం చూపిన ఐఎల్‌ఎఫ్‌ఎల్
ఐఎల్‌ఎఫ్‌ఎల్ రూపంలో దేశీయ మార్కెట్ల పతనం ప్రారంభమైంది. ఇప్పటికే ద్రవ్య లోటు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ద్రవ్యలభ్యత పెను సమస్యగా మారింది. ఈ కారణంగానే నాన్ బ్యాంకింగ్ రంగ సంస్థ ఐఎల్‌ఎఫ్‌ఎల్ కుప్పకూలింది. ఈ కంపెనీలో ద్రవ్య లభ్యతలో కొరత కారణంగా రుణ మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఐఎల్‌ఎఫ్‌ఎల్ కంపెనీ రేటింగ్స్‌ను ఐసిఆర్‌ఎ పలుమార్లు తగ్గించింది. దీంతో ఆ సంస్థ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిణామాల అనంతరం కంపెనీ వేల కోట్ల రూపాయిల బకాయిలను చెల్లించలేక పోవడంతో ప్రభుత్వం కంపెనీని కంపెనీని చేసుకోవాల్సి వచ్చింది. నాన్ బ్యాంకింగ్ సంస్థలు నగదు కొరత కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇది కూడా మార్కెట్ సంక్షోభానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు రూ.91000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ నెల 8న కొత్త బోర్డు సమావేశం కానుంది. కొత్త బోర్డు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసి తదుపరి విచారణ అక్టోబర్ 31లోగా అందజేయనుంది. ఎన్‌సిఎల్‌టి పాత బోర్డును తక్షణం రద్దు చేసి కొత్త బోర్డును నియమించిం ది. కొత్త బోర్డు సభ్యు ల్లో కోటక్ బ్యాంక్ ఛైర్మన్ ఉదయ్ కొట క్, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి జిసి చతుర్వే ది, సెబీ మాజీ చీఫ్ జిఎన్ బాజ్‌పేయ్, మాజీ ఐఎఎస్ అధికారులు వినీత్ నాయర్, మాలినీ శంకర్ ఉన్నారు. గతంలో సత్యం కంప్యూటర్స్ వివాదం విషయంలో కూడా ప్ర భుత్వం రంగంలోకి దిగి కొత్త బోర్డును నియమించింది.