Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

మూడో నెలలోనూ అమెరికా కరెన్సీ సేల్

RBI, which sold USD 6.184 billion in June

జూన్‌లో 6.184 బిలియన్ డాలర్లు విక్రయించిన ఆర్‌బిఐ

న్యూఢిల్లీ: వరుసగా మూడో నెల జూన్‌లోనూ అమెరికా కరెన్సీని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) విక్రయించింది. జూన్‌లో స్పాట్ మార్కెట్‌లో దాదాపు 6.184 బిలియన్ డాలర్లు విలువ చేసే అమెరికా కరెన్సీని విక్రయించింది. ఇటీవల ఆర్‌బిఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెంట్రల్ బ్యాంక్ 4.020 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసి, అదే సమయంలో 10.204 బిలియన్ డాలర్లు విక్రయించింది. మే, ఏప్రిల్ నెలల్లో వరుసగా 5.767 బిలియన్ డాలర్లు, 2.483 బిలియన్ డాలర్లు కొనుగోలు చేపట్టింది. 2017 జూన్‌లో అమెరికా డాలర్ల నికర కొనుగోళ్లు పెరిగాయి. స్పాట్ మార్కెట్‌లో 4.971 బిలియన్ డాలర్ల కొనుగోళ్లు, 1,680 బిలియన్ డాలర్ల విక్రయాలు ఉన్నాయి.

రెండు ఎన్‌పిఎలను విక్రయించనున్న ఎస్‌బిఐ
రెండు ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు)లను ఎస్‌బిఐ విక్రయించనుంది. వీటి విలువ రూ.2490 కోట్లు ఉంటుంది. ఈ ఎన్‌పిఎలను వేలం వేసేందుకు బిడ్‌లను ఆహ్వానించింది. నియంత్రణ సంస్థ మార్గదర్శకాల మేరకు నిరర్థక ఆస్తుల విక్రయంపై ఎస్‌బిఐ త్వరగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎఆర్‌సి, బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు, ఎఫ్‌ఐలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్‌బిఐ బిడ్ డాక్యుమెంట్‌లో పేర్కొంది. ఈ రెండు ఎన్‌పిఎలలో ఒకటి బాంబే రయోన్ ఫ్యాషన్ లిమిటెడ్, దీని విలువ రూ.2200 కోట్లు ఉంటుంది. రెండోది శివం దాతు ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్, దీని విలువ రూ.229 కోట్లు ఉంటుందది. బాంబే రయోన్ రుణాల్లో ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ తీసివేశారు.

Comments

comments