Home తాజా వార్తలు నో డౌట్.. సంక్రాంతి బరిలో చెర్రీ…!

నో డౌట్.. సంక్రాంతి బరిలో చెర్రీ…!

Ramcharan's RC 12

హైదరాబాద్: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని కథనాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమాపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నసంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగులో జాప్యం జరుగుతుందని, దాంతో సంక్రాంతికి విడుదల కావడం కష్టమేననే ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన దర్శక నిర్మాతలు తాజాగా స్పందించారు. ఇప్పటికే ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయిందని, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. నవంబర్ 10నాటికి వాటిని పూర్తిచేసి వెంటనే డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని వారు స్పష్టం చేశారు. అంతేగాక త్వరలోనే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ తేదీని ప్రకటిస్తామన్నారు. దీంతో సంక్రాంతి బరిలో చెర్రీ చిత్రం ఉండటం ఖాయమైపోయింది. ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తుండగా, ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ఇతర ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

RC 12 confirmed for Sankranti 2019 Release

Telangana Breaking News