Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కేదార్ జాదవ్ మెరుపులు

Kedar-Jadhav

బెంగళూరు: ఐపిఎల్ 10వ సీజన్‌లో భాగంగా చిన్నస్వామిస్టేడియంలో శనివారం ఇక్కడ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు ఆటగాడు కేదార్ జాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ బెంగళూరుకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో విజయంతో బెంగళూరుకు రెండు పాయింట్లు లభించాయి. ఢిల్లీ బౌలర్లు విసిరిన బంతులను మెరుపువేగంతో బౌండరీలు, సిక్స్‌లతో చెలరేగిపోయాడు. (37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్)తో 69 హాఫ్ సెంచరీ చేసిన జాదవ్ మెరుపులు మెరిపిస్తూ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ సీజన్‌లో ఆకట్టుకుంటాడని అనుకున్న క్రిస్ గేల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కెప్టెన్ షేన్ వాట్సన్ 24 పరుగులతో పర్వాలేదనిపించినా, మిగతా ఆటగాళ్లంతా పేలవ ప్రదర్శనతో పెవిలియన్ దారిపట్టారు. ఈ క్రమంలో కేదార్ ఒక్కడే జట్టును భారీ స్కోరు దిశగా పరుగులు పెట్టించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్రిస్ గేల్ పేలవ ప్రదర్శనతో (6) పరుగులకే తొలి వికెట్ రూ పంలో పెవిలియన్‌కు చేరాడు. మరో ఆటగాడు మన్‌దీప్ సింగ్ (12) పరుగులతో రెండో వికెట్‌గా చేతులేత్తేశాడు. వెంటవెంటనే ఇరు వికెట్లు కోల్పోవడంతో బెంగళూరు కెప్టెన్ షేన్ వాట్సన్ నిలకడగా ఆడుతూ క్రమంగా దూకుడును పెంచాడు. ఈ క్రమంలో బెంగళూరు 55 పరుగుల వద్ద ఉండగా, నదీమ్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయిన వాట్సన్ (24) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన కేదార్ జాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. నిలకడగా ఆడుతూ ఢిల్లీ బౌలర్లు వేసిన బంతులను వచ్చినవి వచ్చినట్టు జాదవ్ ఉతికి ఆరేశాడు. జట్టులో మిగతా వాళ్లంతా పేలవ ప్రదర్శనతో ఒకరితరువాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టేసినా ఆత్మవిశ్వాసం కోల్పోని జాదవ్ తనదైన శైలిలో విజృంభిస్తూ ఢిల్లీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.

అయితే ఒక దశలో మొత్తం (37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్) 69 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జాదవ్ దూకుడుకు జహీర్‌ఖాన్ 16.6 ఓవర్ల వద్ద బ్రేక్ వేశాడు. దీంతో జహీర్ విసిరిన బంతిని షాట్ ఆడే క్రమంలో మోరీస్‌కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మిగతా ఆటగాళ్లు స్టార్ట్ బిన్ని (16), విష్ణు వినోద్ (9), నెగీ (10) పరుగులు చేయగా, తైమల్ మిల్స్ పరుగులేమీ చేయకుండానే వెళ్లిపోయాడు. ఇక్బూల్ అబ్దుల్లా (5) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా, ప్రత్యర్థి జట్టు ఢిల్లీకి 158 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు ఆటగాడు కేదార్ జాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఛేదనలో ఢిల్లీ కుదేలు..
158 పరుగుల విజయలక్షంలో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఆదిలోనే తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ జట్టు 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి పరాజయం పాలైంది. ఓపెనర్ ఆటగాడు ఆదిత్య తారే (18) తొలి వికెట్‌ను కోల్పోయింది. తారే స్థానంలో వచ్చిన మరో ఆటగాడు కరుణ్ నయర్ (4) పరుగులకే క్లీన్‌బౌల్డ్ అయి రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్ ఆటగాడు శామ్ బిల్లింగ్స్ (25) పరుగులు చేసి ఇక్బాల్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. శామ్సన్ (13), మోరీస్ (4), బ్రాత్‌వెయిట్ (1), కమిన్స్ (6) పరుగులు చేయగా, రిషబ్ పంత్ (57) హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో స్టాన్‌లెక్, అబ్దుల్లా, నెగీ రెండు వికెట్లు తీసుకోగా, మిల్స్, వాట్సన్ తలో వికెట్ తీసుకున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: క్రిస్ గేల్ (సి) శామ్సన్ (బి) మోరీస్ ; 6, కెప్టెన్ షేన్ వాట్సన్ స్టంప్ రిషబ్ పంత్ (బి) నదీమ్ ; 24, మన్ దీప్ సింగ్ (బి) కమిన్స్ ; 12, కేదార్ జాదవ్ (సి) మోరీస్ (బి) జహీర్ ఖాన్; 69, స్టార్ట్ బిన్ని (సి) బిల్లింగ్స్ (బి) జహీర్ ఖాన్; 16, విష్ణు వినోద్ రనౌట్ (నదీమ్/జహీర్ ఖాన్) ; 9, పవన్ నెగీ నాటౌట్ ; 2, ఇక్బాల్ అబ్దుల్లా ; 3
ఎక్స్‌ట్రాలు: 6 మొత్తం: ( 20 ఓవర్లలో 8 వికెట్లు) 157 పరుగులు
వికెట్ల పతనం: 1-26, 2-41, 3-55, 4-121, 5-142, 6-142, 7-157, 8-157.
ఢిల్లీ బౌలర్లు: జహీర్ ఖాన్ : 4-0-31-2, క్రిస్ మోరీస్ : 4-0-21-3, కమిన్స్ : 4-0-29-1, షబాజ్ నదీమ్ : 4-0-13-1, అమిత్ మిశ్రా : 2-0-32-0, బ్రాత్‌వెయిట్ : 2-0-29-0.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఇన్నింగ్స్: ఆదిత్య తారే (బి) మిల్స్ ; 18, శామ్ బిల్లింగ్స్ (సి) స్టాన్‌లేక్ (బి) ఇక్బాల్ అబ్దుల్లా ; 25, కరుణ్ నయర్ (బి) స్టాన్‌లేక్ ; 4, శామ్సన్ (సి) బిన్ని (బి) స్టాన్‌లెక్; 13, రిషబ్ పంత్ (బి) నెగీ ; 57, మోరీస్ ఎల్‌బిడబ్లు (బి) ఇక్బాల్ అబ్దుల్లా ; 4, బ్రాత్‌వెయిట్ (బి) చాహల్ ; 1, కమిన్స్ (బి) వాట్సన్ ; 6, అమిత్ మిశ్రా నాటౌట్ ; 6, నదీమ్ (సి) (బి) నెగి ; 0.
ఎక్స్‌ట్రాలు: 5
మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లు) 142 పరుగులు
వికెట్ల పతనం: 1-33, 2-38, 3-55, 4-84, 5-107, 6-113, 7-125, 8-139, 9-139.
బెంగళూరు బౌలర్లు: బిల్లి : 4-0-29-2, చాహల్ : 4-0-19-1, ఇక్బాల్ అబ్దుల్లా : 3-0-36-2, తైమల్ మిల్స్ : 4-0-33-1, షేన్ వాట్సన్ : 4-0-21-1, నెగి: 1-0-3-2.

Comments

comments