Home నల్లగొండ నరేష్, స్వాతిల విషాదాంతంపై నిజనిర్ధారణ

నరేష్, స్వాతిల విషాదాంతంపై నిజనిర్ధారణ

నరేష్‌ను మరెక్కడో చంపారు, స్వాతిని తండ్రే చంపాడని ఆరోపణ
పత్రికా సమావేశంలో నిజనిర్ధారణ కమిటీ వెల్లడి

                    Naresh-and-Swathi-Love-Stor

నల్లగొండ ప్రతినిధి: నరేష్. స్వాతి ప్రేమ పెళ్ళి విషాదాంతంపై అనేక అనుమా నాలు వ్యక్తమౌతున్నాయని నిజనిర్ధారణ కమిటి సభ్యులు పాశం యాదగిరి, జాన్‌వెస్లీ, భూపతి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం నరేష్ గ్రామం పల్లెర్ల, స్వాతి గ్రామమైన లింగరాజుపల్లిలో ప్రజాసంఘాల సభ్యులతో కలిసి వారు పర్యటిం చారు. నరేష్, స్వాతిల స్నేహితులను, బందువులను కలిసి సమా చారం సేకరించారు. అనంతరం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ నరేష్ సోదరి చెబుతున్న విషయా లకు, శ్రీనివాసరెడ్డి చెబుతున్న దానికి పొంతన లేదని అన్నారు. గ్రామస్థులు చెప్పినదాని ప్రకారం స్వాతిని దహనం చేయడానికి ముందు అక్కడ నరేష్ ను కాల్చి బూడిద చేసిన ఆనవాళ్ళు లేవంటున్నారని చెప్పారు.

నరేష్‌ను ఎక్కడో చంపి మాయం చేశారని తెలిపారు. స్వాతిని కూడ శ్రీనివాసరెడ్డే హత్య చేసివుంటాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో స్థానిక పోలీసుల పాత్రవుందన్నారు. నరేష్ హత్య జరిగిన తరువాత శ్రీనివాసరెడ్డి ఇంట్లో రెండుసార్లు విందుభోజనాలు జరిగాయని , అందులో ఎవరె వరు పాల్గొన్నారో తెలియాల్సివుందని అన్నారు. ఇప్పటివరకు కేసులో ఖచ్చితమైన విచారణ జరగలే దన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూన్4న సుందరయ్య విజ్జాన కేంద్రంలో నిరసన సభ జరుపుతున్నట్లు చెప్పారు. మూడు నెలల్లో కేసులోని నిందితులను శిక్షించకపోతే ఛలో భువనగిరి కార్య క్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్ర మంలో తెలంగాణ రాష్ట్ర పౌర సామాజిక ప్రజా సంఘాల సభ్యులు నిజని ర్ధారణ కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, సామాజిక సంఘాల రాష్ట్ర నాయకులు జాన్ వెస్లీ, భూపతి వెంకటేశ్వర్లు, ఎస్.రమ, గోపాల్, రాజారావు, ఎంవి.రమణ, బాలకృష్ణ, అబ్బాస్  పాల్గొన్నారు.