Search
Saturday 17 November 2018
  • :
  • :

నోట్ల రద్దు దెబ్బతో … కూలీలుగా మారిన రియల్ బ్రోకర్లు

హోటల్ వద్దకు చేరే బ్రోకర్ల జాడ కరువాయే

పూట గడవక బిత్తరపోతున్న రియల్ బ్రోకర్లు
కార్లు, బైకులు వదిలి… కాలి నడకలు సాగిస్తున్నారు

 టీ డబ్బులకు టికాణా లేక విలవిల్లాడుతున్నారు
జియో సిమ్‌లతో…జీవనంలో.. బ్రోకర్లు…

Real-Estateకోరుట్ల రూరల్: నల్లధనం కుభేరుల భరతం పట్టాలనే ఉద్దేశ్యంతో వెయ్యి, ఐదువందల నోట్లను రద్దు అంటు సంచలన నిర్ణయం తీసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడి దెబ్బకు రైతులు, సామాన్య జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తమైనదే. అయితే దేశ దిశ మారుతుందనే నమ్మకాలతో ఎన్ని ఇక్కట్లనైన సామాన్యు ఎదుర్కొంటున్నారు.

కానీ మోడీ సంచల నిర్ణయం వెలువడిన నాటి నుండి రియల్ దందా వ్యవహారాలు దాదాపుగా నిలిచాయనే సందేహాలు కలుగక మానవు. వేసిన చొక్కకు ఒక్క మరక అంటించుకోకుండా వేల రూపాయలను సంపాదించిన రియల్ బ్రోకర్ల తీవ్ర గడ్డు కాలమే ఎదురవుతుంది. ఒక్క ఫ్లాట్ అమ్మించి ఇరువర్గాల వారి నుండి వేల రూపాయలను కమీషన్‌ల రూపంలో విలాసవంతమైన బతుకులకు అలవాటుపడిన బ్రోకర్లు పూట గడవక బిత్తరపోతున్నారు.

కార్లు, బైకులు వదిలి…కాలి నడకే శరణ్యం
ఇంతకు ముందు రోజుల్లో ప్లాట్‌ల అమ్మకాల కమీషన్లతో కార్లు, ఖరీదైన ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ అందరినీ ఆకర్షించే తరహాలో వ్యవహరించిన బ్రోకర్ల హుందాలు ఓహో అనే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు వారి వాహనాల్లో ఇందనం పోయించుకునేందుకు కూడా వంద రూపాయలు జేబుల్లో లేక కనీసం చాయ్‌కి కూడా దూరమవుతు బతుకులను సాగిస్తున్నారు.

కనీసం సెల్ ఫోన్లలో బ్యాలెన్స్ వేయించు కోలేని దయనీయ స్థితిలో ‘జియో’ ఉచిత ఫోన్‌లతో ప్రస్తుతానికి జీవనం సాగిస్త్తున్నారు. మరికొందరు ట్రాక్టర్ కూలీ పనులకు వెళుతు దీనమైన జీవనం సాగిస్తు, నాడు ధర్జాగా బతికి నేడు కూలీ పనులకు వెళ్తునప్పటికీ వారి కుటుంబంలో పూట గడపడం కూడా కష్టమవుతోంది. కష్టపడడం అలవాటుని మరిచి తేరగా వచ్చే డబ్బులతో జల్సాలు చేసే వారికి గడ్డుకాలం ఎదురైందంటే ఖచ్చితంగా నోట్ల దెబ్బ అనే పలువురు వివరిస్తున్నారు.

Comments

comments