Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

’ఆఫీస్ స్పేస్‘కు హైడిమాండ్

Real estate business is growing significantly in cities

హైదరాబాద్‌లో 8% పెరిగిన అద్దెలు
17 శాతంతో ముందంజలో బెంగళూరు
రానున్న రెండేళ్లలో మారనున్న హైదరాబాద్ ముఖచిత్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటి, సాఫ్ట్‌వేర్ రంగం వృద్ధిచెందుతున్న నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం గణనీయంగా పెరుగుతోంది. ఐటి సంస్థల కార్యాలయాలను నెలకొల్పడానికి రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లు, డెవలపర్లు ‘ఆఫీస్ స్పేస్’ పేరుతో వసూలుచేస్తున్న అద్దెలు కూడా ఏటేటా పెరుగుతున్నా యి. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఐటి సంస్థలకు ఆఫీస్ స్పేస్ అద్దెలో సగటున 8% వృద్ధి నమోదైందని, ఒక్కో చదరపు అడుగు విస్తీర్ణానికి సగటున రూ. 53 చొప్పున వసూలు చేస్తున్నట్లు ‘నైట్ ఫ్రాంక్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అన్నింటికంటే గరిష్టంగా ఢిల్లీ నగరంలో అద్దె ఎక్కువగా ఉంటోందని, ఒక్కో చ.అ.కు రూ.107 చొప్పున ఉన్నట్లు పేర్కొనిం ది. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీలో రూ.78, పూణెలో రూ. 66, బెంగుళూరులో రూ.70, చెన్నయ్‌లో రూ.57, హైదరాబాద్‌లో రూ.53 చొప్పున ఉన్నట్లు పేర్కొనింది. ప్రతీ ఏటా హైదరాబాద్‌లో 8% చొప్పున వృద్ధి నమోదవుతూ ఉం దని, గరిష్టంగా బెంగుళూరులో ఇది 17% వృద్ధితో ఉందని పేర్కొనింది. ముం బాయి నగరం మాత్రం మరే నగరంకంటే వెనకబడిందని, ఏడాది కాలంలోనే 9% (మైనస్‌లో) ఉందని పేర్కొనింది.

మరో రెండేళ్లలో హైదరాబాద్‌కు మరింత మెరుగైన స్థానం : బెంగళూరు సంవత్సరానికి 8 శాతం చొప్పున హైదరాబాద్‌లో అద్దెలు పెరుగుతున్నందున మరో రెండేళ్లలో మరింత మెరుగైన స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. నగరం నలువైపులా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహాకాలను కల్పిస్తుండడంతో పాటు నగరాన్ని ఐదు సెక్టార్లుగా విభజించింది. ఈస్ట్ హైదరాబాద్ (ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్)లుండగా, వెస్ట్ హైదరాబాద్ (కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్)లు, నార్త్ హైదరాబాద్ (కొంపల్లి, మేడ్చల్, అల్వాల్)లు, సౌత్ హైదరాబాద్ (శంషాబాద్, రాజేంద్రనగర్)లు, సెంట్రల్ హైదరాబాద్ (బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట) అనే ఈ ఐదు సెక్టార్లలో ఎక్కువగా వెస్ట్, సెంట్రల్ సెక్టార్లలోనే అద్దెలు అనుకున్నదానికన్నా ఎక్కువగా దూసుకుపోతున్నట్లు సర్వే ప్రతినిధులు పేర్కొన్నారు.

సంవత్సరానికి 8 శాతం చొప్పున పెరుగుతున్న అద్దెలు : తాజా గణాంకాల ప్రకారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆఫీసు కార్యాలయాల్లో ఒక్కో చదరపు మీటర్‌కు రూ. 431 నుంచి 506 రూపాయల వరకు అద్దె ఉంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. మాదాపూర్, హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాల్లో ఇది రూ.560నుంచి 667 ఉందని, నిర్దిష్టంగా ఈ ప్రాంతంలో 9% పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. గచ్చిబౌలిలో రూ. 517 నుంచి 570 అద్దె ఉన్నట్లు పేర్కొన్న ఆ ప్రతినిధులు గత ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరిగినట్లు తెలిపారు.

హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట ప్రాంతాల్లో కొత్తగా ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నందున ‘ఏ గ్రేడ్’ కార్యాలయాల భవనాల్లో ఇప్పటి నుంచే సంస్థల కార్యకలాపాల కోసం రిజర్వు చేసుకుంటున్నాయి. ఐటియేతర వాణిజ్య సంస్థల వాటా 31 శాతం క్షీణించగా ఐటీ రంగా ల వాటా మాత్రం 43 శాతానికి పెరిగింది. దీంతో ఇతర సేవలు అందించే సం స్థలు ఈ ఏరియాల్లో సంస్థలను నెలకొల్పడానికి పోటీపడుతున్నాయి. రాను న్న 2 సంవత్సరాల్లో ఆఫీసుకు సంబంధించి కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఏరియాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ఆ సర్వే రిపోర్టు అంచనావేసింది. అవి ప్రారంభమైన నగరంలో మార్పులు వస్తాయని, ముఖ్యంగా ఐటి, ఆర్థిక రంగాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుందని అంచనావేసింది.

Comments

comments