Home తాజా వార్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

SUICIDEనల్గొండ : మిర్యాలగూడ పట్టణంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన శ్రీనివాస్ (45) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్‌లో నష్టాలు వచ్చి అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్యాలగూడ పట్టణంలోని జీవీ ఆస్పత్రి వద్ద విషం తాగి కారులోనే ఉండి లాక్ చేసుకున్నాడు. శ్రీనివాస్ అపస్మారకస్థితిలో ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని ఆస్మతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.