Home బిజినెస్ మౌలిక వసతులు కల్పిస్తేనే ‘రియల్’ పరుగులు

మౌలిక వసతులు కల్పిస్తేనే ‘రియల్’ పరుగులు

 సిఎంఆర్ ఇన్‌ఫ్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లూరి మురళీధర్ రెడ్డి

Sridhar-Reddy

హైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తే రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంద ని సిఎంఆర్ ఇన్‌ఫ్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ చల్లూరి మురళీధర్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌కు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఔటర్‌రింగ్ రోడ్ నలుమూలల తగిన మౌలిక సదుపాయా లు ఏర్పడితే మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తాయని, తద్వారా రియల్ ఎస్టేట్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. లాభార్జనే లక్షంగా కాకుండా వినియోగదారుల అభిరుచులు, అందమైన డిజైన్లతో తమ వెంచర్లను నిర్మిస్తున్నామన్నారు. వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఏర్పా టు చేసిన వెంచర్లకు మంచి ఆదరణ లభించిందని, తమ సంస్థ పట్ల వినియోగదారుల్లో విశ్వసనీయత పెరిగిందని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పరిస్థితులపై చల్లారి మురళీధర్ రెడ్డి ‘మన తెలంగాణ”తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. తమ వెంచర్లలో రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల విలువ చేసే గృహ నిర్మాణాలకు అత్యంత డిమాండ్ ఉన్నదని, ఇలాంటి ప్రాజెక్ట్‌లపైనే వినియోగదారులు ఆసక్తిచూపుతున్నారని వివరించారు. అన్ని వర్గాలవారి అభిరుచుల మేరకు అందమైన గృహాలను నిర్మిస్తున్నామన్నారు.
పెద్దనోట్లు, జిఎస్‌టి కొంత ఇబ్బందే..
ఇటీవల పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలుతో రియల్ ఎస్టేట్ రంగంపై కొంత మేరకు ప్రభావం పడిందని చల్లూరి మురళీధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ రంగం అభివృద్ధి చెందినప్పటికీ పెద్దనోట్ల ప్రభావంతో కొంత ఇబ్బంది ఎదురైందని, తాజాగా జిఎస్‌టితో కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, అయినా భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనివివిధ మెట్రో నగరాలతో పొలిస్తే హైదరాబాద్‌లోనే భూమి ధరలు, ప్లాట్ల ధరలు తక్కువగా ఉన్నాయని, అందుకే చాలా సంస్థలు, వ్యాపార వేత్తలు హైదరాబాద్‌పైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ వ్యాపార వాణిజ్య సముదాయ స్థలాలకు చాలా డిమాండ్ ఉన్నదని, సంస్థలన్ని ఒకే ప్రాంతానికి పరిమితం కావడంతో కొన్ని ప్రాంతాల్లోనే వ్యాపార సముదాయ స్థలాలకు కొరత ఉందన్నారు.
రేరా పరిశీలించిన తర్వాతనే..
రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టాన్ని (రేరా) అమలులోనికి వచ్చిన నేపథ్యంలో అందులోని అంశాలను పరిశీలించిన తర్వాతనే తమ నూతన ప్రాజెక్టులను నిర్మిస్తామని చల్లూరి మురళీధర్ రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రొత్సహించే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, రేరాలో అనేక నిబంధనలు ఉన్నాయని, వాటిని పూర్తిగా పరి శీలించి, నిబంధనల మేరకే తమ వెంచర్ల నిర్మాణం ఉంటుందన్నారు. హెచ్‌ఎండిఎ నిర్మా ణ అనుమతులు మరింత సులభతరంగా ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. నిబంధ నల మేరకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాలలో దస్త్రాల విషయంలో కొంత జాప్యం జరుగుతుందని, దీనిని కూడా నివారించేందుకు మరింత సులభతర పద్ధతులను అవలంభించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
‘రీచ్ మీడోస్’కు మంచి స్పందన
ఇటీవల హైదరాబాద్‌లోని బొంగులూరు, ఆదిభట్ల వద్ద ప్రారంభించిన తమ వెంచర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని చల్లూరి మురళీధర్ రెడ్డి తెలిపారు. టాటా కన్సల్టెన్సీ, హార్డ్‌వేర్‌పార్కు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టకు ద గ్గరలోనే ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రారంభ ధర సుమారు రూ.47 లక్షలు ఉందన్నారు. హెచ్‌ఎండిఎ అనుమతులతో కూడిన పూర్తి వాస్తుతోనే గృహాలను నిర్మిస్తున్నామని, ప్లాట్లకు కూడా మంచి డిమాండ్ ఉందన్నా రు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నుంచి మొదలు అన్ని సదుపాయాలను కల్పించినట్లు ఆయన వివరించారు.