Home తాజా వార్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

SUICIDE

హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ గార్డెన్ లో  ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. వాకింగ్ వచ్చిన వారు ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి మైలార్‌దేవ్‌పల్లికి చెందిన మహిపాల్‌రెడ్డిగా గుర్తించారు. వాకింగ్‌కు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.