Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

చేపలమ్మే ఈ విద్యార్థిని గుర్తుందా!

 real story of Hanan Hamid, the college girl selling fishes
త్రిస్సూర్‌కి చెందిన బిఎస్ సి విద్యార్థిని హనన్ హమీద్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా రోజు కాలేజీ అయిపోయిన తరువాత వెంటనే రద్దీగా ఉండే ఓ కూడలిలో చేపలు అమ్ముతూ ఉంటుంది. కాలేజీ యూనిఫామ్‌లో చేపలు అమ్ముతూ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రస్తుతం కేరళ వరదల్లో కూరుకున్న నేపథ్యంలో వరద బాధితులకు రూ.1.5లక్షలు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది.. తనకు వచ్చిన దాతల విరాళాలు మొత్తం వరద బాధితులకే ఇస్తున్నట్లు చెప్పింది. ప్రజల నుంచి నాకు అందిన విరాళాలను తిరిగి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వారంతా కష్టాల్లో ఉన్నారు. నేను వారికి చేయగలిగిన కనీసం సాయం ఇది..” అని హనన్ అంటోంది.

చేపలు అమ్ముతున్న ఈ విద్యార్థిని ‘‘పబ్లిసిటీ స్టంట్‌” కోసమే ఇలా చేస్తోందంటూ కొందరు సోషల్ మీడియాలో వేధింపులకు దిగడంతో వివాదం రేగింది. బతుకుదెరువు కోసం ఆమె చేస్తున్న పోరాటంపై సీఎం పినరయి విజయన్‌తో పాటు అనేక మంది నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. పలువురు దాతలు ఆమెకు సహాయం చేశారు. తనకు వచ్చిన విరాళాలను తిరిగి ఇచ్చేస్తాననీ.. కాలేజీ తర్వాత కష్టపడి సంపాదించిన సొమ్మును మాత్రమే తనతో ఉంచుకుంటానని ఆమె చెప్పడం అప్పట్లో ఒక పెద్ద విశేషం. ఇప్పుడు డబ్బులు డిపాజిట్ చేసేందుకు మొబైల్ కనెక్టివిటీగానీ, బ్యాంకులు గానీ పనిచేయడం లేదనీ.. డిపాజిట్ చేసేందుకు వీలుకాని పక్షంలో నేరుగా ముఖ్యమంత్రిని కలిసి చెక్కు అందజేస్తానని ఆమె అంటోంది. ప్రతి ఒక్కరు డబ్బుల రూపంలో కాకుండా వారికి నిత్యావసరాలకు ఉపయోగపడే వస్తువులను కూడా పంచితే బాగుంటుందని హనన్ హమీద్ చెబుతోంది.

Comments

comments