Home టెక్ ట్రెండ్స్ భారత మార్కెట్ లోకి ‘రియల్‌మి3’ స్మార్ట్ ఫోన్ విడుదల

భారత మార్కెట్ లోకి ‘రియల్‌మి3’ స్మార్ట్ ఫోన్ విడుదల

Realme 3 smartphone

 

న్యూఢిల్లీ: ఒప్పో సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి మరో సరికొత్త మొబైల్‌ను సోమవారం భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. రియల్‌మి2తో అనుసంధానం చేస్తే, అటు రూపకల్పన పరంగానూ, ఇటు ఫ్రంట్‌ కెమెరాను అప్‌గ్రేడ్‌ చేసి రియల్‌మి3 పేరిట తీసుకొచ్చింది. 3డి గ్రేడియంట్‌ యూని బాడీ డిజైన్‌, వాటర్ ‌డ్రాప్‌ నాచ్‌, హీలియో పి70 ప్రాసెసర్‌, 4,230 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర అద్భుత ఫిచర్లతో విడుదల చేసింది.

బ్లాక్‌, డైనమిక్‌ బ్లాక్‌, రేడియంట్‌ బ్లూ వేరియంట్‌లో లభించినున్న ఈ ఫోన్ 3జిబి ర్యామ్‌+ 32జిబి ధర రూ.8,999గా ఉంది. 4జిబి ర్యామ్‌+ 64జిబి ధర రూ.10,999గా ఉంది. దీనిని మార్చి 12వ తేదీన మధ్యాహ్నం 12గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్‌ సేల్‌ ప్రారంభమవుతుంది. మొదటి మిలియన్‌ కొనుగోలు దారులకు 3జిబి ర్యామ్‌ వేరియంట్‌ రూ.8,999కు లభించనున్నట్టు రియల్‌మి తెలిపింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.500 అదనంగా రాయితీ లభించడంతో పాటు జియోతో రూ.5,300 అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. మొబిక్విక్‌ ద్వారా చెల్లింపు చేస్తే 20% సూపర్‌ క్యాష్‌ రూపంలో పొందవచ్చు.

Realme 3 Smartphone Release in Indian Market