Home టెక్ ట్రెండ్స్ భారత్‌లో అమ్మకానికి రియల్‌మీ యు1

భారత్‌లో అమ్మకానికి రియల్‌మీ యు1

Realme U1 ముంబయి: ఇండియన్ మార్కెట్లో తొలిసారిగా రియల్‌మీ యు1 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి. గతవారమే స్వదేశీ మార్కెట్లో రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్లు రేపటి నుంచి అమెజాన్ సైట్ లో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బిఐ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్… నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్లు సంస్థ ప్రకటించింది. రియల్‌మీ యు1, 3జిబి/32 జిబి ర్యామ్ వేరియంట్లలో రూ.11,999 ధరకు వినియోగదారులకు లభించనుంది. ఇందులో 4జిబి ర్యామ్/64 జిబి ర్యామ్ ఇన్‌బిల్ట్ స్టోరేజీ కలిగిన ఫోన్ రూ.14,999 ధరకు అందుబాటులోకి రానుంది.

రియల్‌మీ యు1 అద్భుత ఫీచర్లు… 
 డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే
2.5 డీ కర్వ్‌డ్ గ్లాస్, 13 ఎంపి+2 ఎంపి డ్యూయల్ రియర్ కెమెరాలు కలిగి ఉంది.
ఎఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్, 25 ఎంపి సెల్ఫీ కెమెరా తదితర అద్భుత ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌లో 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ కలదు.