Home రంగారెడ్డి అనుమానాస్పదస్థితిలో రియల్టర్ ఆత్మహత్య

అనుమానాస్పదస్థితిలో రియల్టర్ ఆత్మహత్య

                           Realtors

ఇబ్రహీంపట్నం: అనుమానాస్పదస్థితిలో  ఓ రియల్టర్ ఆత్మహత్య చేసు కున్న సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆదిభట్ల సమీపంలోని ఎస్‌ఎస్ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ ఆఫీసులో నల్గొండ జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి అనే రియల్టర్ నగరంలోని ఓంకార్ నగర్ ప్రాంతంలో భార్యాపిల్లలతో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదిభట్ల పరిసర ప్రాంతాంలో రియల్ ఎస్టేట్‌లో భాగంగా భూముల కొనుగోలు, అమ్మకాలు జరుపు తున్నట్లు తెలిపారు.

అయితే మంగళ వారం సాయంత్రం ఎస్‌ఎస్ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ ఆఫీసులో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. విషయం తెలుసు కున్న పోలీసులు సంఘట నాస్థలానికి వెళ్లి ఆత్మ హత్యకు గల కారణాలు పరిశీ లించినట్లు తెలిపారు. కృష్ణారెడ్డి అనుమా నాస్పద మృతిపై పలువురు అనుమానం వ్య క్తం చేస్తున్నారు. మృతుడి భార్య, బంధు వులు వచ్చేవరకు మృతదేహాన్ని తరలిం చ వద్దని పలువురు డిమాండ్ చేయడంతో మృ తదేహాన్ని పోలీసులు అక్కడే ఉంచారు. కా గా రెండు, మూడు రోజులుగా భాగ స్వా మ్య వ్యాపారులతో వాగ్వాదం జరిగి, ఘర్షణ జరిగినట్లు సమాచారం.