Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

దూసుకెళ్లిన రియల్టీ షేర్లు

Brokers

ముంబయి: రియల్ ఎస్టేట్ దిగ్గజం ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్  చేసిన ప్రకటనతో మార్కెట్లో రియల్టీ షేర్లు దూకుడును ప్రదర్శించాయి. మరోవైపు స్టాక్‌మార్కెట్లు నష్టాల దిశలో ఉన్నా రియల్టీ మాత్రం జోరును చూపింది. గత వారం ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించిన ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం.. రానున్న ఫలితాలపైనా ఇన్వెస్టర్లు ఆందోళన చెందడంతో సూచీ లు పత నమయ్యాయి. అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులు కూడా నష్టాలకు కారణమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 48 పాయింట్లు క్షీణించి 29,413వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 12 పాయింట్లు తగ్గి 9,139 పాయిం ట్లకు చేరుకుంది.

అన్ని రంగాలు ప్రతికూలంగానే ముగిసినప్పటికీ రియల్టీ కౌంటర్‌కు మాత్రం అనూహ్యంగా డిమాండ్  ఊపందుకుంది. ఏకంగా 8 శాతం జంప్‌చేసింది. ఇక మెటల్, ఫార్మా, ఐటి, పిఎస్‌యు బ్యాంక్ నష్టాలను చవిచూశాయి. ఇండియాబుల్స్ రియల్టీ 42 శాతం దూసుకెళ్లి అందరినీ ఆశ్చ ర్యపర్చింది. ఎన్‌టిపిసి, ఇన్‌ఫ్రాటెల్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, లుపిన్, టిసిఎస్ షేర్లు నష్టపో యాయి. గెయిల్, గ్రాసిమ్, ఐబి హౌసింగ్, ఆర్‌ఐఎల్, పవర్‌గ్రిడ్ లాభాల దిశగా పయనించాయి. కాగా మార్కెట్ లో ఇండియా బుల్స్ రికార్డ్ స్థాయిని నమోదు  చేసింది.  ఐబీ రియల్టీ 40 శాతానికిపైగా  పుంజుకుని  ఇంట్రా డేలో ఏప్రిల్ 20, 2011  నాటి స్తాయిని తాకింది.

దీంతో రియల్టీ రంగం కూ డా  దూసుకుపోయింది.  ఈ అనూహ్య డిమాండ్ నేపథ్యంలో  రియల్టీ ఇండె క్స్ రెండేళ్ల గరిష్టానికి చేరింది.  ప్రధానంగా బిజినెస్ పునర్వ్యవస్థీకరణ ప్రక టించిన ఇండియాబుల్స్ రియల్టీ కౌంటర్  భారీగా దూసుకెళ్లి ఈ రంగానికి కిక్ ఇచ్చింది. దీంతో రియల్టీ ఇండెక్స్ కూడా 6.5 శాతం జంప్‌చేసింది. ఇదేబాటలోఇతర రియల్టీ షేర్లు కూడా పయనించాయి. ముఖ్యంగా  హెచ్‌డీ ఐఎల్ 9.6 శాతం, డిఎల్‌ఎఫ్ దాదాపు 7 శాతం  ఎగిశాయి. వీటితోపాటు యూనిటెక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, శోభా, డెల్టాకార్ప్, ఫినిక్స్, ఒబెరాయ్ 6-1.3 శాతంమధ్య  లాభపడ్డాయి.

Comments

comments