Home అంతర్జాతీయ వార్తలు ఔట్‌సోర్సింగ్ కాదు, నిపుణులు కావాలి

ఔట్‌సోర్సింగ్ కాదు, నిపుణులు కావాలి

Recent Changes to the H1B Visa in the US

వాషింగ్టన్: అమెరికాకు అత్యంత నిపుణులయిన ఉద్యోగులు రావాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కాదని, అందుకే హెచ్1బి వీసా నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యం త్రాంగం భావిస్తోందని వైట్‌హౌస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రతిభావంతులయిన ఉద్యోగులను అమెరికాకు అహ్వానించేందుకే హెచ్1బి వీసాల్లో మార్పులు చేయాలని ట్రంప్ యంత్రాంగం అనుకుంటున్నట్లు ఆ అధికారి చెప్పారు. టెక్నాలజీ తదితర రంగాల్లో అత్యంత నిపుణులైన ఉద్యోగులను అమెరికాలోనే ఉంచేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు ట్రంప్ అనేక సందర్భాల్లో చెప్పారని వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పాలసీ కోఆర్డినేషన్ క్రిస్ లిడెల్ గురువారం వాషింగ్టన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. అధ్యక్షుడు నాణ్యమైన వలస విధానం గురించి మాట్లాడుతున్నారని, అయితే చట్టపరమైన సమస్యలు వస్తాయని ఆయన భయపడుతున్నారని లిడెల్ చెప్పారు. అయితే చట్టపరంగా కాకుండా నియంత్రణపరంగా ముందుకు వెళ్లవచ్చని అన్నారు. ఎందుకంటే హెచ్1బి విధానాల్లో చాలావరకు చట్టపరమైనవే ఉన్నాయనిఆయన చెప్పారు. ఇప్పుడు లక్షా ఇరవై వేలమంది హెచ్1బి ఉద్యోగులు ఉన్నారని, ఇది చాలా ఎక్కువ సంఖ్య అని క్రిస్ లిడిల్ చెప్పారు.అయితే వీరిలో ఎక్కువ మంది తక్కువ నైపు ణ్యం కలవారు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే ఉంటున్నారని ఆయన చెప్పారు. అందుకే ఈ విధానాన్ని మార్చి అత్యం త నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అమెరికాకు వచ్చేలా చూడాలని ట్రంప్ భావిస్తున్నారని ఆయన తెలిపారు. అందుకే నియంత్రించాలను అనుకుంటున్నామని, చట్టపరంగా చేయగలిగితే ఇంకా మంచిదని లిడిల్ అన్నారు. క్రిస్ లిడిల్ గతంలో మైక్రోసాఫ్ట్, జనరల్ మోటార్స్‌లో ఎగ్జిక్యూటివ్ పదవుల్లో పని చేశారు. ట్రంప్ పాలసీ విధానాల రూపకల్పన విభాగంలో పని చేస్తున్నారు.

Recent Changes to the H1B Visa in the US

Telangana News