Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

మన వంటలు

Meals

బ్రెడ్ నూడిల్స్ టోస్ట్

కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు : 5
క్యారెట్ : 1 (తరిగి),ఉల్లిపాయ : 1 (తరిగి)
క్యాబేజి తరుగు ః 2 టేబుల్ స్పూన్లు

బేబీకార్న్ : 2 (సన్నగా తరిగి)
నూడిల్స్ : 1 కప్పు; పచ్చిమిర్చి : 3
టమోటా తరుగు : 1/2 కప్పు
ప్రాసెస్డ్ చీజ్ : 2 కప్పులు
చాట్ మసాలా : 2 టేబుల్ స్పూన్లు
నూనె : 1 టీస్పూన్
మిరియాల పొడి : తగినంత, ఉప్పు : తగినంత.
తయారీ విధానం
* నూడిల్స్, కూరగాయ ముక్కల్ని కలిపి నీళ్లు పోసి ఉడికించాలి. * ముక్కలు ఉడికిన తరువాత మసాలా వేసి కొన్ని నిముషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి.
* బ్రెడ్ ముక్కలపై కొద్దిగా నూడిల్స్ మిశ్రమం ఉంచి దానిపై కొద్దిగా చీజ్, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, మళ్లీ కొద్దిగా చీజ్ వేసి ఓవెన్‌లో పెట్టాలి. * చీజ్ గోధుమ రంగులోకి మారేవరకు వేడి చేయాలి. * దీన్ని వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

చుడువా

కావలసిన పదార్థాలు
ఓట్స్ : కప్పు
అటుకులు : 1/2 కప్పు
జీడిపప్పు పలుకులు : 5
బాదం పలుకులు : 5
ఎండుమిర్చి : 4
ఇంగువ : కొద్దిగా
పసుపు : 1/4
కరివేపాకు రెబ్బలు : 3
చక్కెర : స్పూను
కారం : కొద్దిగా
చాట్‌మసాల : కొద్దిగా
ధనియాల పొడి : 1/2 స్పూను
ఉప్పు : తగినంత.
తయారీ విధానం
* బాండీలో నూనె లేకుండా ఓట్స్‌ని వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. * అలాగే అటుకుల్ని కూడా వేయించుకుని అందులోకి తీసుకోవాలి. * అదే బాండీలో జీడిపప్పు, బాదం పలుకులు, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు వేయించుకుని ఓట్స్, అటుకులపై వేసేయాలి. * తరువాత ఇంగువ, పసుపు, తగినంత ఉప్పు, కారం, చాట్‌మసాలా, ధనియాలపొడి, చెక్కర వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి.

లెమన్ ఓట్స్

కావలసిన పదార్థాలు
ఓట్స్ : 3 కప్పులు
నీళ్లు : కప్పు
వేరుశనగ పప్పు ; 2 స్పూన్లు
నిమ్మరసం : 2 స్పూన్లు
ఆవాలు : ఒక టేబుల్ స్పూను
జీలకర్ర : ఒక టేబుల్ స్పూను
పచ్చిశనగపప్పు : 2 స్పూన్లు
పచ్చిమిరపకాయలు : 3 లేదా 4 (తరిగిపెట్టుకోవాలి)
కరివేపాకు : కొద్దిగా
ఇంగువ : చిటికెడు
నూనె : తగినంత
తగినంత ఉప్పు : తగినంత.
తయారీ విధానం
* మందపాటి గిన్నె లేదా బాండీలో తగినంత నూనె వేసి కాగిన తరువాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర,వేరుశనగపప్పు,పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి వేయించుకుని నీరు పోసి, ఉప్పు వేసి తెర్లనివ్వాలి.
* నీరు తెర్లుతున్న సమయంలో ఓట్సు వేసి ఉడికించాలి.
* దించే ముందు నిమ్మరసం జతచేయాలి.

మరమరాల ఉగ్గాణి

కావలసిన పదార్థాలు
మరమరాలు లేదా బొరుగులు : 3 కప్పులు
పచ్చిమిర్చి : ౩
పసుపు : 1/2 స్పూను
వేగించిన వేరుశనగపప్పు పొడి : 1/2 స్పూను
ఆవాలు + మినపప్పు : 1 టీస్పూన్
కరివేపాకు : 4 రెబ్బలు
నూనె : 1 టేబుల్ స్పూను
ఉప్పు : తగినంత.
తయారీ విధానం
* కడాయిలో ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, పసుపు, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వేగనివ్వాలి. * (ఈ లోపు మరమరాల్ని నీటిలో ముంచి, రెండు క్షణాల్లో తీసేసి నీరుపిండేసి పక్క నుంచుకోవాలి) తాలింపులో నానిన మరమరాల్ని వేసి సన్నని మంటపైన కలుపుతూ రెండు నిముషాల తర్వాత వేరుశనగపపుప పొడి కలపాలి. * దించేశాక వేరుశనగపప్పుతో అలంకరించు కోవాలి. (వేరు శనగపప్పు పొడి బదులు పుట్నాల (వేయించిన శనగపప్పు) పొడి కూడా కలుపు కోవచ్చు.

కంట్రీ చెఫ్ సుస్మిత చౌదరి
సుస్మిత స్కూల్ ఆఫ్ కుకరి

9393169595

Comments

comments