Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ప్రజా పోలీసులుగా పని చేసినపుడే గుర్తింపు

police

* జిల్లా ఎస్‌పి కల్మేశ్వర్ సింగనెవార్

మన తెలంగాణ/ఆసిఫాబాద్ : విధి నిర్వహణను దైవంగా భావించి ప్రజా పోలీసులుగా పనిచేసినపుడే అమోఘమైన గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్‌పి కల్మేశ్వర్ సింగనెవార్ అన్నారు. గురువారం సిర్పూర్(టి) ఏఎస్సైగా పనిచేసిన నారాయణ పదవీ విరమణ పొం దిన చెండంతో ఆయనను పూలమాల, శాలువాతో ఎస్పీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సేవే పరమవాదిగా పనిచేసి పదవీ విరమణ పొందిన వారిని సన్మానించుకోవడం మన యొక్క అదృష్టమన్నారు. స్థానికి హెడ్‌క్వార్టర్‌లో పదవీ విరమణ పొందిన నారాయణను సన్మానించి వారి యొక్క 29 సంవత్సరాల సర్వీసులో చేసిన సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి యొక్క శేషజీవితంతో సుఖసంతోషాలతో ఉండాలని అభిలాషించారు. వారికి రావల్సిన బెనిఫిట్స్‌ను తక్షణమే అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర రెడ్డి, పోలీసులు సూర్యకాంత్, వెంకటేష్, అజయ్, ఆర్‌ఎస్‌ఐ సంతోష్, నవీన్, శేఖర్‌బాబు, ఎస్‌పి సీసీ కిరణ్‌కుమార్, పిఆర్‌ఓ మనోహర్‌లు పాల్గొన్నారు.

Comments

comments