Home రాష్ట్ర వార్తలు ఎపితో సఖ్యత

ఎపితో సఖ్యత

cmమహారాష్ట్రతో మాదిరిగానే సయోధ్య, గోదావరి నీటిలో వెయ్యి టిఎంసిలు తెలంగాణ, మిగిలిన 2వేలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి అభ్యంతరం లేదు, దుమ్ముగూడెం తర్వాత నీరు ఎపిదే, వెళ్లిపోయిన గ్రామాలు త్వరలో తిరిగి వెనక్కి
భద్రాచలంలో ముఖ్యమంత్రి కెసిఆర్
ఖమ్మం: పక్కనే ఉన్న మహా రాష్ట్రతో సయోధ్య చేసుకున్నామని, అలంపూర్ నుంచి భద్రాచలం వరకు సరిహద్దు ఆంధ్రప్రదేశ్తో గిల్లికజ్జాలకు పోకుండా సామరస్య పూర్వక పద్ధ్దతుల్లో చర్చించుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు పరస్పర సహకారం అవసరమని, ఎపికి తెలంగాణ సహకరిస్తుందని తెలిపారు. ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీరామనవమి ఉత్స వాల్లో పాల్గొన్న ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ గోదావరి నీటిలో 1000 టి ఎంసిల వరకు తెలంగాణ వాడుకుంటుందని, మిగిలిన 2 వేల టిఎంసిల నీటిని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునేందుకు తమకేమి అభ్యంత రం లేదన్నారు. దుమ్ముగూడెం తర్వాత గోదా వరి నీటిని తెలంగాణ వినియోగించుకునే అవ కాశమే లేదన్నారు. భద్రాచలం టెంపుల్ సిటిలో 1/70 చట్టాన్ని సవరించేందుకు తగు పరిశీలన చేస్తామని, అవసరమైతే ప్రభుత్వం భూమిని తీసుకుని గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి వినియోగిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీన మైన కొన్ని ప్రాంతాలను తిరిగి ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరామన్నారు. భద్రాచ లం చుట్టూ ఉన్న గ్రామాలతో పాటు శబరి నది వరకు (కూనవరం) ఇవ్వాలని కోరగా చంద్ర బాబు సుముఖతవ్యక్తం చేశారని, దీనిపై శాసన సభలో కూడా ప్రకటన చేయడం జరిగిందని, మరో మారు చర్చించి ఆ గ్రామాలు తిరిగి తెలంగాణలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని సిఎం తెలిపారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, గోదావరి – కృష్ణ నదుల పరివాహ కంలో ఉన్న ఖమ్మం జిల్లాలో గల ప్రతి అంగుళానికి నీరు ఇస్తామ న్నారు. ఇప్పటికే సీతారామ, భక్త రామదాసు సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టడం జరిగిందని, మూడు, నాలుగు సంవత్సరాల్లో సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఈరెండు ప్రాజెక్టులకు సంబంధించి ఇంజనీర్లతో పాటు ప్రత్యేక సాధన చేశామన్నారు. ప్రాజెక్టులపై అవగాహన లేని, సాగు నీటికి సంబంధించి కనీస అవగాహన లేనివారు అవాకులు, చవాకులు పేలుతున్నారని, గోదావరి నది నీటిని ఈ 60 సంవత్సరాల్లో వినియోగించుకుంది శూన్యమన్నారు. ఎవరు ఏమి చెప్పినా ఖమ్మం జిల్లాలో నూటికి నూరు శాతం భూమికి సాగునీటి వసతి కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సిఎం తెలిపారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు ప్రశంసిస్తుంటే ఇక్కడ కొంత మంది పని గట్టుకుని విమర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. నీటి అయోగ్ ఉపాధ్యక్షులు అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు తెలంగాణ లో మిషన్ భగీరథ మాదిరి మంచినీటి పథకాలు అమలు చేయాలని కోరుతూ ఉత్తరాలు సైతం రాయడం జరిగిందన్నారు. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.