Home స్కోర్ కుదిరిన సయోధ్య

కుదిరిన సయోధ్య

west-indiesకింగ్స్‌స్టన్ : వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు, ఆటగాళ్ళకు మధ్య రేగిన కాంట్రాక్టు వివాదం ముగిసింది. బోర్డు మ్యాచ్ ఫీజు ను తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు భార త్ ఆతిథ్యమిస్తు న్న టీ-20 ప్రపంచకప్‌కు మేము దూరం గా ఉంటామని స్టార్ ఆటగాళ్లు గేల్, డ్వైన్‌బ్రావో, సామీ తదితర ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బోర్డు వారం రోజులుగా పలుమార్లు చర్చలు జరిపినా ఆట గాళ్ళు వెనక్కి తగ్గలే దు. దీంతో ఆగ్రహించిన బోర్డు ఆదివా రం లోపల బోర్డు కాంట్రాక్టును సమ్మతించాలని, లేకపోతే ద్వితీయశ్రేణి జట్టును టీ-20 ప్రపంచకప్‌నకు పంపుతామ ని హెచ్చరించింది. బోర్డు గడువుపై చర్చించిన ఆటగాళ్ళు ఎట్టకేలక ఆదివారం బోర్డు కాంట్రాక్టుపై సమ్మతి తెలుపుతూ లేఖరాశారు. ఈ మేరకు విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదలచేసింది. కాగా గాయంతో బాధపడుతున్న డారెన్ బ్రావో, కిరన్ పొలార్డ్‌తో పాటు ఐసిసి నిషేధం ఎదుర్కొంటు న్న సునీల్‌నరైన్‌లు టీ-20 ప్రపంచకప్‌కు దూరమయ్యారు.