Home అంతర్జాతీయ వార్తలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

Temperaturesవాషింగ్టన్ : పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్‌నినో ఏర్పడటం, మానవ చర్యల వల్ల పెరుగుతున్న భూతాపం తో ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 1880లో ఉష్ణోగ్రత నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యాక ఇంతటి ఎండలు ఎప్పుడూ తలెత్తలేదని అమెరికా అంతరిక్ష(నాసా) పేర్కొంది. 1951 నుంచి 1980 మధ్య కాలంలో నమోదైన ప్రపంచ సరాసరి ఉపరితల ఉష్ణోగ్రత కన్నా, ఫిబ్రవరిలో 1.35 డిగ్రీల సెల్సియన్ మేర ఎక్కువ వేడిమి నమోదైందని ఈ డేటా పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతను ఇది బద్దలు కొట్టింది. దీన్ని బట్టి 1980 నుంచి ఏనెల సరాసరి ఉష్ణోగ్రతను తీసుకున్నా, గత నెలలో నమోదైన ఉష్ణోగ్రతే అత్యధికమని నాసా పేర్కొంది. లోగడ ఉష్ణోగ్రత ఫిబ్రవరి 1998లో వెలుగు చూసింది. ఆ ఏడాది కూడా బలమైన ఎల్‌నినో ఉందని నాసా వెల్లడించింది. ఆ ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో 0.846 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైందని పేర్కొంది. ఇదే సమయంలో భూ వాతావరణంలో కార్బన్‌డైఆక్సయిడ్ స్థాయి ఎక్కువగా ఉంది.