Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

రికార్డుల తారుమారుకు రంగం సిద్ధం?

ప్రభుత్వ భూమే లేనట్లుగా చూపేందుకు ప్రయత్నం

Land-Mafia

గద్వాల ప్రతినిధి: రెండు రోజుల క్రితం వడ్డేపల్లిలో భూ మాయ పేరిట మన తెలంగాంణలో కథనం ప్రచురితమైంది. దీనికి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ స్పందించి సంబంధిత మండల తహసిల్దార్ విచారణకు ఆదేశించారు. జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర నివేధికను అందజేయాలంటూ జారీ చేశారు. దీనిపై మండల తహసిల్దార్ చంద్రమౌళి శనివారం సర్వేనెం 146 లో ఉన్న 2.12 ఎకరాల భూమిని గుర్తేంచేందుకు క్షేత్ర స్థాయిలో విచారణకు వెళ్లారు.

విషయం తెలుసుకున్న కబ్జా పెట్టిన పలుకుబడి దారుడు అప్పుడే తనదైన శైలీలో వాస్తవాలను బయటకు రాకుండా అన్ని ప్రయత్నాలను మొదలుపెట్టారు. తమకు అనుకూలంగా ఉన్న రెవెన్యూ అధికారుల సహాయంతో సర్వే నెం 146 ల సర్కారి భూమే లేనట్లుగా చేసేందుకు ఏకంగా రికార్డులనే తారుమారు చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారంపై సంబంధిత తహసిల్దార్‌ను వివరాణను అడిగేందుకు ప్రయత్నించగా ఆయన ఫోను అందుబాటులోకి రాలేదు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప నిజాలు బయటకు రావని స్థానికులు అనుకుంటున్నారు.

Comments

comments