Home తాజా వార్తలు కేరళలో జనజీవనం అస్తవ్యస్తం

కేరళలో జనజీవనం అస్తవ్యస్తం

Red Alert in Kerala with Heavy Rains

తిరువనంతపురం : కేరళలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 167 మందికి పైగా చనిపోయారు. వర్ష, వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర సిఎం పినరయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడారు. శుక్రవారం రాత్రి మోడీ కేరళకు వెళుతారు. శనివారం ఆయన రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేస్తారు. వందేళ్ల తరువాత ఇంతటి భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వేలాది ఇళ్లు నేలమట్టం కావడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Red Alert in Kerala with Heavy Rains