Home రాజన్న సిరిసిల్ల కంది రైతుల పడిగాపులు

కంది రైతుల పడిగాపులు

  • పేరుకే మార్కెట్ కమిటీలు
  • రైతులకు దక్కని గిట్టుబాటు ధరలు
  • గన్నీ సంచుల కొరత పేరిట కొనుగోళ్లు నిలిపివేసిన అధికారులు
  • జగిత్యాల జిల్లాలో 13 మార్కెట్ కమిటీలు
  • ఒకటి, రెండు మినహా మార్కెట్‌లలో జరగని కొనుగోళ్లు
  • వ్యవసాయ మార్కెట్లలో రైతుల నిలువు దోపిడీ

Agriculture-Market

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుల కొనుగోలు కేంద్రంలో కందుల కొనుగోలు చేసేవారు లేక 5 రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కందులను ఏఎంసికి తరలించి 5రోజులవుతున్నా గన్నీ సంచుల కొరత పేరిట అధికారులు కందుల కొనుగోలుకు నిరాకరించడం తో రైతులు ఏఎంసిలో రోజంతా కందులకు పందుల నుండి రక్షణగా కావలి ఉండడమే కాకుండా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ హోటళ్లలో భోజనాలు చేస్తూ రాత్రిళ్లు ఇంటికి వెళ్లి కందుల కావలికి మరొకరిని పంపిస్తూ తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. ఈ సందర్భంగా మన తెలంగాణ ప్రతినిధి సో మవారం ఉదయం ఎఎంసిని సందర్శించగా చీర్లవంచకు చెందిన కారం బాలయ్య, మచ్చ భూమయ్య, ముస్తాబాద్‌కు చెందిన తలారి నర్సింహులు, మరో 15మంది రైతులు అ ధికారుల కోసం ఎదురుచూస్తూ కనిపించారు. కందుల కొనుగోలు విషయమై వారిని కదిలించగా 5 రోజులుగా ప డిగాపులు పడుతున్నామని గన్నీ సంచుల కొరత పేరిట కొనుగోలు చేయడం లేదని తామంతా రోజుల తరబడి ఎ ఎంసిలోనే ఉండాల్సి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశా రు. మార్క్‌ఫెడ్‌కు సంబంధించిన అధికారులెవరూ ఎఎం సిలో అందుబాటులో లేకపోవడం మన తెలంగాణ గమనిం చింది. రైతులు వందలాది క్వింటాళ్ల కందులను ఎఎంసికి తెచ్చి రోజుల తరబడి కొనుగోలు చేసే అధికారుల కోసం ని రీక్షిస్తున్నారు. కాగా ఏఎంసి కార్యదర్శి తన్నీరు రాజశేఖ ను మన తెలంగాణ ప్రశ్నించగా కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంతో తమకు సంబంధం లేదని పూర్తిగా మార్క్‌ఫెడ్ వారే చూసుకుంటున్నారన్నారు.
కేవలం తమ మార్కెట్ యార్డు స్థలాన్ని, తాటిపత్రిలను అం దించడంతో పాటు ఇతర మౌళిక సదుపాయాలను కల్పిం చడం మాత్రమే ఎఎంసి పని అని కొనుగోళ్ల వ్యవహారం అ ంతా మార్క్‌ఫెడ్ అధికారులే చూసుకుంటారని అన్నారు. కాగా అనధికారికంగా అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకు 1153మంది రైతుల నుంచి 5541 క్వింటాళ్ల కందు లను మార్చి 1వ తేదీ వరకు కొనుగోలు చేసి ఫిబ్రవరి 20వ తేదీ నాటి వరకు కొనుగోలు చేసిన కందులకు 1.06 కోట్ల రూపాయలు రైతులకు పంపిణీ చేసినట్లుగా తెలిసింది. ఇ దిలా ఉండగా సోమవారం సుమారు 10 వేల గన్నీబ్యాగు లు ఏఎంసికి చేరినట్లుగా సమాచారం. మరో రెండు మూడు రోజులు నిల్వ ఉన్న కందులను కొనుగోలు చేసిన అనంత రం కొత్తగా రైతుల నుంచి కందులను కొనుగోలు చేస్తారని తెలుస్తుంది.
పెద్దపల్లిలో…
రైతు పండించిన పంటలకు గిట్టబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఎర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లు మధ్యదళారులకు, అధికారులకు అక్షయ పాత్రగా మారా యి . వ్యవసాయ మార్కెట్ వ్యవస్థలో ఉండే లోపభూయి ష్టమైన అమ్మకం విధానం తో రైతులు నిలువు దోపిడికి గు రవుతున్నారు. మార్కెట్‌లో ఉండే అడ్తిదారులు ,కొనుగోలు దారులు అనే రెండంచెల వ్యవస్థకు, అధికారులు అంతర్గ తంగా అండగా నిలవడంతో రైతులకు గరిష్ట గిట్టుబాటు ధ ర లభించడం లేదు.పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి , సుల్తానా బాద్,మంథని,కమాన్‌పూర్,కాల్వశ్రీరాంపూర్, ధర్మా రం , జూలపల్లిలో మొత్తం ఏడు వ్యవసాయ మార్కెట్ లు కలవు .జూలపల్లి మినహ అన్ని మార్కెట్ యార్డలకు పాలకవర్గా లను ఈ మద్యనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది . జిల్లా కేం ద్రంలో ఉన్న పెద్దపల్లి మార్కెట్‌లో మాత్రమే అన్ని సీజన్‌ల లో పత్తితో సహ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుండగా, సుల్తానాబాద్, మంథని మార్కెట్లలో మాత్రం ,ఖ రీఫ్,రబీ సీజన్‌లలో నామమాత్రంగా కొనుగోలు జరుగు తోంది .కాల్వశ్రీరాంపూర్ , దర్మారం మార్కెట్‌లలో కేవలం ఐకేపిసెంటర్లు సీజన్‌లో వడ్లను కొనుగోలు చేస్తున్నాయి .కమాన్‌పూర్ , జూలపల్లి వ్యవసాయ మార్కెట్లు బోర్డులకే పరిమితమయ్యాయి.జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో నడుస్తు న్న వ్యవసాయ మార్కెట్‌లో ఈ మధ్యనే కందుల కొనుగో లు కేంద్రాన్ని నాఫెడ్ సంస్థ హకా ఆధ్వర్యంలో ప్రారం భించింది . పక్షం రోజులలోనే గన్నీ సంచుల కొరత నెపం తో కొనుగోలు కేంద్రాన్ని వారం రోజుల క్రితం మూసి వే యడంతో కంది రైతులు రెండు సార్లు రోడ్డెక్కి ఆందోళన చే శారు . గడిచిన వారం రోజుల నుంచి పెద్దపల్లి మార్కెట్‌కు తీసుకొచ్చిన కందులను మార్కెట్ గోదాంలలో నిల్వ ఉం చారు . గన్నీ సంచులు అందుబాటు లోకి వచ్చిన తరువాత మార్కెట్ గోదాములలో నిల్వ ఉంచిన కందులను హకా సంస్థ ద్వారా కొనుగోలు జరిపిస్తామని అధికారులు చెబు తున్నారు. పత్తి రైతులకు గిట్టు బాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ నామ్ వి ధానం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో కేవలం మాటలకే పరిమితమయింది . ఆన్‌లైన్ విధానం పేరిట కొనుగోలు జ రుగుతోందని మార్కెట్ అధికారులు చెబుతున్నా ట్రేడర్లంద రు సిండికేటాయి అడ్తి కేంద్రాలకొచ్చిన పత్తిని వంతులవా రిగా పంచుకొని సిండికేటయి ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు పాల్ప డుతున్నారు . పత్తి రైతులు ఈ సీజన్‌లో పలుమార్లు అందో ళన చేసినా కొనుగోలు విధానంలో మార్పు రాలేదు . పేరు కు మాత్రమే ఈ నామ్ విధానమని, కొనుగోలుదారులు సిండికేట్ గా మారి దోచుకుంటున్నారని రైతులు ఆరోపి స్తున్నారు . ప్రస్తుతం రాష్ట్రంలోని ఈ నామ్ అమలవుతు న్న అన్ని మార్కెట్లలో ఇంట్రా మండి మొదటి విధానం కొనసాగసుతోందని , మొదటి దశంలో స్థానిక ట్రెడర్లు ఆన్ లైన్‌లోనే బిడ్డింగ్ చేస్తున్నారని, రెండవ దశ అయిన ఇం ట్రా మండి విధానం రాబోయే సీజన్‌లో ప్రారంబించడం జ రుగుతుందని , ఇంట్రా మండి విధానంలో ఈ లైసెన్స్ పొ ంది ట్రేడర్ దేశంలో ఎక్కడినుండైనా కొనుగోలు చేసే అవ కాశం ఉన్నందున, అప్పుడు రైతుకు గరిష్ట మద్దతు ధర ల భించే అవకాశం ఉంటుందని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ అధికారి ప్రవీణ్ కుమార్‌రెడ్డి చెబుతున్నారు .ప్రభుత్వం రైతులకు గరిష్ట మద్ధ్దతు ధర లభించేందుకు ఎన్ని విధా నాలను రూపొందించినా మార్కెట్ యార్డ్‌లలో దళారులు సిండికెట్‌గా మారి రైతులను నిలువునా ముంచుతున్నారు .
మార్కెట్‌లో సౌకర్యాలు కల్పించాలి : కట్ట సరోజ
ధర్మారం వ్యవసాయ మార్కెట్లో అన్నివసతులు కల్పించి, అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాల ని దర్మారం మండలం మేడారం ఎంపిటిసి కట్ట సరోజ తెలి పారు . గడిచిన రబీ సీజన్‌లో కేవలం వడ్లు మాత్రమే కొను గోలు చేశారని అన్నారు .దర్మారం వ్యవసాయ మార్కెట్లో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి ,వచ్చే సీజన్ నుండైనా అన్ని రకాల కొనుగోళ్లు జరపాలి ఆమె ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు .
జగిత్యాలలో…
రైతులు పండించిన పంట ఉత్పత్తులను విక్రయించుకునేం దుకు ప్రభుత్వం మార్కెట్‌లను నిర్మించి, రైతుల సమస్య లను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్కెట్ కమి టీలను ఏర్పాటు చేసినా రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. మార్కెట్ కమిటీలకు రైతులు తీసుకొచ్చిన ప ంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రాకపోవడం.. రవాణా త దితర ఖర్చులు తడిసి మోపెడు అవుతుండడంతో ధాన్యాన్ని మార్కెట్‌లకు తీసుకెళ్ళకుండా రైతులు గ్రామాల్లోనే దళా రులకు విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతుల అ మాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుంటున్న ద ళారులు తాము చెప్పిందే వేదం అన్నట్లు తక్కువ ధరలకు కొ నుగోలు చేసి రైతులను నిండా ముంచుతున్నారు. రైతులకు అండదండగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయా ల్సిన మార్కెట్ కమిటీ పాలకవర్గాలు సైతం తమకేమి పట్ట న్నట్లు వ్యవహరిస్తున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు. జిల్లా పరిధిలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పెల్లి, ఇబ్రహీంపట్నం, క థలాపూర్, మేడిపల్లి, రాయికల్, ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి, మల్యాల,పెగడపల్లి మండల కేంద్రాల్లో మార్కెట్ యార్డ్‌లున్నాయి. ఆయా యార్డ్‌లకు ప్రభుత్వం మార్కెట్ క మిటీలను కూడా ఏర్పాటు చేసింది.
జిల్లాలో 13మార్కెట్ కమిటీలు ఉండగా అందులో జగి త్యాల,కోరుట్ల,మెట్‌పల్లి,గొల్లపల్లి,మల్యాల, ధర్మపురి మా ర్కెట్ యార్డ్‌లలో కొనుగోళ్లు పర్వాలేదనిపిస్తుండగా మిగ తా మార్కెట్ యార్డ్‌లలో మాత్రం కొనుగోళ్ళు నామమాత్రం గా సాగుతున్నాయి. రాయికల్‌లో తొమ్మిది నెలల క్రితం మార్కెట్ యార్డ్ ప్రారంభం కాగా ఇప్పటి వరకు ఎలాంటి కొనుగోళ్లు జరగలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థ మవుతోంది. రాయికల్ గతంలో ధర్మపురి మార్కెట్ యార్డ్ పరిధిలో ఉండగా తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది నెలల క్రితం రాయికల్‌లో మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసింది. మార్కెట్ యార్డ్ ఏర్పాటై తాత్కాలిక గోదాం నిర్మాణం జరిగినా కొనుగోలు మాత్రం ప్రారంభం కాలేదు. రాయికల్ మార్కెట్ యార్డ్‌లో కొనుగోళ్లు జరిగినట్లయితే రాయికల్ మండల పరిధిలో 27గ్రామాలు, మేడిపెల్లి మండల పరిధి లోని ఐదు గ్రామాల రైతులకు మేలు జరుగుతుంది. ఆడ్తీ దారులు కొనుగోళ్ళకు ముందుకు రాకపోవడంతో రైతుల కు తిప్పలు తప్పడం లేదు. వరి, మొక్కజొన్న ఉత్పత్తులను ఐకెపి, సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేం ద్రాల్లో విక్రయించుకుంటుండగా పసుపు రైతులు నిజామా బాద్, మెట్‌పెల్లి ప్రాంతాలకు తీసుకెళ్ళి విక్రయించుకో వాల్సిన పరిస్థితి నెలకొంది. “అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని” అన్న చందంగా మార్కెట్ యార్డ్, మార్కెట్ కమి టీ పాలకవర్గం ఉన్నా తమకు మాత్రం ఎలాంటి ప్రయో జనం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోరుట్ల మార్కెట్ యార్డ్ పరిధిలో కోరుట్ల మండలంతో పాటు కథ లాపూర్, మేడిపెల్లి మండలాలు ఉండేవి. అయితే కోరుట్ల మార్కెట్ యార్డ్ నుంచి కథలాపూర్ మండలాన్ని విడదీసి కథలాపూర్‌లో మార్కెట్ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే మేడిపెల్లిలో కూడా మార్కెట్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే గతంలో కోరుట్ల మార్కెట్ యార్డ్‌లో పంట ఉ త్పత్తుల కొనుగోల్లు జోరుగా సాగగా మేడిపెల్లి, కథలాపూర్ మండలాలను విడదీయడంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి.
మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మార్కెట్‌యార్డ్‌ల్లో సైతం కొనుగోళ్లు సాఫీగా సాగడం లేదు. గొల్లపెల్లి వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న పెగడపెల్లి మండలాన్ని విడదీసి అక్కడ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసినా ఇంత వరకు కొ నుగోళ్లు ప్రారంభం కాలేదు. మార్కెట్‌లలో మోసాలను ఆరికట్టేందుకు, పంట పండించిన రైతన్నకు గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ఈనామ్ పద్దతిని ప్రవేశ పెట్టినా ఆ పథకంపై రైతులకు అవగాహన కల్పించడంలో సంబంధిత యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మార్కెట్ లను మరింత అభివృద్ధి పరిచి మార్కెట్‌లకు పంట ఉ త్పత్తులు తీసుకొచ్చే రైతన్నలకు గిట్టుబాటు ధర దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే రైతన్నకు లాభం జరు గుతుందని అన్నదాతలు పేర్కొంటున్నారు.