Search
Sunday 18 November 2018
  • :
  • :

మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు

వందశాతం నల్లా బిల్లు బకాయిల వసూళ్లే లక్షంగా జలమండలి కసరత్తు
15 రోజుల్లో స్పందించకుంటే కనెక్షన్ కట్
నగరంలో 10 లక్షల నల్లా కనెక్షన్లు
భారీగా పేరుకుపోయిన బకాయిలు

NALLA

మన తెలంగాణ/సిటీబ్యూరో : రానున్న మార్చినాటికి వందశాతం నల్లా బిల్లు బకాయిల వసూళ్లే లక్ష్యంగా జలమండలి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జలమం డలి మొండి బకాయిదారులు, ప్రభుత్వ సంస్థ్ధలకు రెడ్ నోటీసులు జారీ చేసి, నోటీసులు అందిన 15 రోజుల్లో బకాయిలు చెల్లించకపోతే నల్లా కనెక్షన్లు కట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం మహానగరంలో 9లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 5లక్షల మంది నెల నెల సక్రమంగా బిల్లులు చెల్లిస్తున్నారు. మ రో 4లక్షల మంది నల్లా బిల్లు చెల్లింపులో క్రమం తప్పు తున్నారు. చాలమంది మొండిబకాయిదారులు ఏళ్ల తర బడి బకాయిలు చెల్లించకపోవడంతో బోర్డుకు రావాల్సి బకాయిలు రూ.వందల కోట్లకు చేరుకున్నాయి.  వీరికి ఎన్నిసార్లు బిల్లులు జారీ చేసినా వారు స్పందించడంలేదు.

సాధారంగా వినియోగదారులతో పాటు  వ్యాపార, వాణిజ్య సంసలు కూడా ఇదే మార్గంలో పయనిస్తున్నాయి. ప్రస్తుతం  3257 వాణిజ్య కనెక్షన్‌దారుల నుంచి  రూ.21.18, 30 మంది పరిశ్రమల యజమాన్యాల  నుంచి రూ.2.81 కోట్ల బకాయిలు బోర్డుకు రావాల్సి ఉంది. అలాగే 86,694మంది  గృహవినియోగదారుల నుంచి  రూ.30.27 కోట్ల బకాయి డబ్బులు రావాల్సి ఉంది.  దీనిని సీరియస్‌గా తీసుకున్న జలమండలి ఎండీ ఎం.దానకిశోర్  నగరవ్యాప్తంగా మొండిబకాయిలను పూర్తి స్ధాయిలో వసూలు చేసి, బోర్డు ఆదాయాన్ని వందశాతానికి పెంచాలని నిర్ణ యించారు. ఇందులో భాగంగా మొండిబకాయిదారులపై కఠినవ్యవహరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. దీంతో 20డివిజన్లలో గత గత ఆరు నెలలుగా బిల్లు బకాయిలు చెల్లించని వినియోగదారులు  జాబితాను అధికారులు  సిద్దం చేసి వారికి  రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు.

ఈ నెల 9వతేది నుంచి ఈ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. గృహా,వాణిజ్య,పారిశ్రామిక విభాగాలకు సంబంధించిన బిల్లుబకాయిదారుల ఇళ్లకు సిబ్బంది రెడ్‌నోటీసులు అతికిస్తున్నారు.  15 రోజులలోగా సదరు వినియోగదారులు స్వచ్చంద్ధంగా  ముందుకువచ్చి  బకాయిలు చెల్లించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంటున్నారు. లేనిపక్షంలో తక్షణమే బకాయిదారుల ఇళ్లకు సంబంధించిన నల్లా కనెక్షన్లను నిర్ధాక్షిణ్యంగా కట్ చేస్తామని  నోటీసుల ద్వారా హెచ్చరిస్తున్నారు. అయితే జలమండలి నుంచి  నోటీసులు అందుకున్న వారిలో 5 శాతం మంది వినియోగదారులు తమ బకాయిలను చెల్లించినట్లు అధికారులు తెలిపారు. 1664 వాణిజ్య కనెక్షన్‌దారులు రూ.2.04, 16 పరిశ్రమల యజమాన్యాలు రూ.0.14, కోట్లు  36,359 మంది గృహావినియోగదారులు రూ. 8.04 కోట్ల మేర చెల్లించినట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో నోటీసులు అందుకుని కూడ ఇప్పటి వరకు స్పందించని మొండిబకాయిదారులపై మరింత కఠినంగా వ్యవహరించాలని జలమండలి భావిస్తోంది. మొండిబకాయిదారులు దిగివచ్చి  బకాయిలు చెల్లించేవరకు వారి వెంటపడి  ఈ ఏడాది మార్చి నాటికి నెలవారీగా వందకోట్ల రెవెన్యూ ఆదాయాన్ని ఆర్జించే దిశగా బోర్డు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.

Comments

comments