Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మార్కెట్లోకి రెడ్‌మి వై1, రెడ్‌మి వై1 లైట్

Redimi

ముంబయి: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ జియోమి మరో కొత్త మొబైల్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. సెల్ఫీ ప్రియులను ఆకర్షించడమే లక్షంగా రెడ్‌మి వై1, రెడ్‌మి వై1 లైట్ పేరిట కొత్త ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒప్పో, వివో వంటి కంపెనీలకు పోటీగా ఈ కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. రెడ్‌మి వై1 ధర రూ.8,999గా, వై1 లైట్ ధర రూ.6,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ రెండు ఫోన్లు అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ వెబ్‌సైట్లలో ఈ నెల 8 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఆఫ్‌లైన్ విక్రయ కేంద్రాల్లోనూ ఈ ఫోన్లు లభించనున్నాయి. ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మి వై1 మొబైల్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ ఎల్‌ఇడి సెల్ఫీ లైట్‌తో 16 కెమెరా కలిగి ఉండడం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. అలాగే వై1 లైట్ పేరిట వచ్చిన మరో మొబైల్‌ను కూడా షియోమి మార్కెట్లోకి తీసుకొచ్చిది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఎంఐయుఐ 9ను కూడా ఆవిష్కరించింది. త్వరలో రెడ్‌మి నోట్ 4, ఎంఐ మిక్స్ 2, ఎంఐ మ్యాక్స్2 ఫోన్లకు అప్‌డేట్ అందిస్తామని తెలిపింది. రెడ్‌మి వై1 మొబైల్ 3జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,999గా కంపెనీ నిర్ణయించింది. 4జిబి, 64జిబి వేరియంట్ ధరను రూ.10,999గా పేర్కొంది. 2జిబి ర్యామ్, 16జిబి ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్న వై1 లైట్ మొబైల్ ధరను రూ.6,999గా కంపెనీ నిర్ణయించింది.

Comments

comments