న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ల మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న జియోమి మరో సరికొత్త ఫోన్ రెడ్మి నోట్ 4ను ఈనెల 19న భారత్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈమేరకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు షియోమీ ప్రకటనలలో పేర్కొంది. కొత్త ‘రెడ్మీ నోట్4’ మొబైల్ విడుదల తేదీ ఈనెల 19 అని ప్రకటించింది. ప్రముఖ ఆన్లైన్ స్టోర్ ఫ్లిప్కార్ట్లో వీటి విక్రయాలు చేపట్టనున్నట్టు పేర్కొంది. విడుదల సందర్భంగా ధరను ప్రకటించనున్నారు. చైనాలో గతేడాది ఆగస్టులో ఈ ఫోన్ విడుదలైంది. 2జిబి ర్యామ్, 16జిబి ఇంటర్నల్ మెమొరీ, 3జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమొరీ అనే రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. 2జిబి వేరియంట్ ధర రూ.9వేలు, 3జిబి వేరియంట్ రూ.12వేలు ఉండే అవకాశముంది. మరింత ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో కొత్త ఫోన్ను సిద్ధం చేసింది.