Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

జీవక్రియలోపం ప్రమాదమే

bodtజీవక్రియ సరిగా లేకపోవడం వలన స్థూలకాయం, రక్తపోటు, హృదయవ్యాధి,రెండవ రకం మధుమేహం ఏర్పడుతున్నాయి. ఇన్సులిన్ నిరోధకత, ఇంకా స్థూలకాయం భారతీయులలో అత్యంత ప్రమాదకర జీవలక్షణాలుగా గుర్తించారు. దాదాపు 25 శాతం ప్రపంచ జనాభాలో జీవక్రియ లక్షణాలున్నట్టు అంచనా వేశారు. జీవక్రియ లక్షణాలలో మార్పులు చేసుకోవాలంటే ముందుగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్య కరమైన ఆహారపుటలవాట్లు చేసుకోవాలి,శారీరక శ్రమ చేయాలి.
భారతీయుల్లో జీవక్రియ సిండ్రోమ్ కోసం నిర్ధారణ ప్రమాణాలుఃభారతీయ పురుషుల నడుము చుట్టుకొలత 35 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే, మహిళల చుట్టుకొలత 31 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే అనారోగ్య ముప్పు పొంచి ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ 23 కన్నా ఎక్కువ ఉండకుండా చూడాలి.
ఈ నియమాలు పాటించి జీవక్రియ లోపాన్ని సరిచేసుకోవాలి.
*దాదాపు 30 నిమిషాల సేపు సాధారణం నుంచి వేగంగా శారీరక వ్యాయామం. వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యుని ఆమోదం తీసుకోవాలి.
*నియమం ప్రకారం కాలానుగుణంగా వచ్చే పండ్లు, కూరగా యలు,ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు చేసుకోవాలి. ఉప్పు,నూనెలు,కొవ్వు పదార్థాలు,మాంసాహారం,బేకరీ పదార్థాలు తగ్గించాలి. మాంసానికి ప్రత్యామ్నా యంగా బీన్స్,కాయధాన్యాలు,విత్తనాలు,పనీర్ వంటివి తీసుకోవాలి.
*ఒమేగా ఆరు ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకుని,అంటే సహజ నూనెలు ఆలివ్,సోయాబీన్ వంటి ఒమేగా 3 ఉన్న ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి.
*వేయించడానికి లేదా తాలింపుకి నూనెను తక్కువ మోతాదులో ఉపయోగించాలి. ఒక టీస్పూన్ నూనె సరిపోతుంది. రోజుకి 20 నుంచి 25 మిల్లీలీటర్ల నూనె వరకే పరిమితం చేయాలి.
రోజుకి 2000 కేలరీలు మాత్రమే శరీరంలోకి వెళ్లేలా చూడాలి
*వండిన/పచ్చి కూరగాయలు మూడు కప్పులు ఆహారంలో తీసుకోవాలి. అంటే పొద్దున్న,మధ్యాహ్నం,సాయంత్రం ఒక్కో కప్పు చొప్పున తీసుకోవాలి. ఒక కప్పు కూరగాయలకు బదులు ఆకు కూరలు తినచ్చు.
*పప్పు ధాన్యాలు శాఖాహారులు వారానికి ఏడు సార్లు తీసుకోవాలి. రోజుకు ఒక కప్పు ఉడికించిన పప్పు ధాన్యాలు,శెనగలు లాటివి తీసుకోవాలి. మాంసాహారులు వారానికి ఒకటి లేదా రెండుసార్లు పప్పు బదులు మాంసాన్ని తీసుకోవచ్చు.
*తృణధాన్యాలు తినాలి.గోధుమ చపాతి నూనె లేకుండా లేదా ఉడికించిన ముడి బియ్యం అన్నం ఏదో ఒకటి ఎంచుకోవాలి. చిరు ధాన్యాలైన రాగి,జొన్నలని వారానికి మూడుసార్లు ధాన్యాలకు బదులు ఇవ్వచ్చు.
*పీచు పదార్థం రోజుకి 30 గ్రాములు తీసుకోవాలి. అందులో 7 నుంచి 13 గ్రాముల దాకా కరిగే పీచుతీసుకోవాలి. పప్పు ధాన్యాలు,కూరగాయలు,పండ్లు,తృణధాన్యా(పొట్టు ధాన్యాలు)లో పీచు పదార్థం ఉంటుంది. ముడి బియ్యం ఆహారంలో తీసుకోవడం వలన కూడా 30 గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఉప్పు వాడకం తగ్గిస్తే మంచిది. రోజుకి ఒక మనిషికి 1500 మిల్లీ గ్రాములు తీసుకోవాలి. ట్రైగ్లిసరైడ్‌లు అనేవి రక్తంలో కనిపించే ఒక రకమైన కొవ్వు. ట్రైగ్లిసరైడ్‌లు స్థాయి పెరిగితే,అవి గుండె జబ్బు ప్రమాదాన్ని పెంచుతాయి. లోపలికి తీసుకునే కేలరీలు పెరిగినట్లయితే కొవ్వుగా రూపాంతరం చెందుతాయి. ఊబకాయం,వ్యాయామం లేకపోవడం వలన రక్తంలో ట్రైగ్లిసరైడ్ స్థాయి పెరగచ్చు.

Comments

comments