Home తాజా వార్తలు తాగు నీటి సమస్య తగ్గింది : కెటిఆర్

తాగు నీటి సమస్య తగ్గింది : కెటిఆర్

KTR1

హైదరాబాద్ : హైదరాబాద్‌లో తాగునీటి సమస్య గణనీయంగా తగ్గిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గతంలో వేసవి కాలం వచ్చిందంటే, జలమండలి వద్ద మహిళలు ఆందోళనలు చేసేవారని, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తాగునీరు అందిస్తుండడంతో మహిళలు ఆందోళనలు చేయడం లేదన్నారు. ప్రజలకు తాగునీరు అందించడంలో వాటర్ వర్క్, హెచ్‌ఎండిఎ సమన్వయంతో పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.