Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

తగ్గిన రైతుల ఆత్మహత్యలు : హరీశ్‌రావు

TH

హైదరాబాద్ : తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్టు స్వయంగా కేంద్రమంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారని ఆయన చెప్పారు. ఆర్థిక పద్దులపై చర్చ సందర్భంగా శుక్రవారం హరీశ్ రావు అసెంబ్లీలో మాట్లాడారు. బిజెపి పాలనలో ఉన్న మహారాష్ట్ర, కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆయన చెప్పారు. తమది రైతు ప్రభుత్వమని, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం పటిష్టమైన విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పంట పెట్టుబడి ఇస్తామని చెప్పడంతో రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజాదరణ లేని కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేకనే వారు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా తామె విజయం సాధించి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Reduced Farmers suicides in Telangana

Comments

comments