Home బిజినెస్ తగ్గిన టిసిఎస్ హెచ్-1బి వీసా దరఖాస్తులు

తగ్గిన టిసిఎస్ హెచ్-1బి వీసా దరఖాస్తులు

 2015తో పోలిస్తే మూడో వంతుకు క్షీణత
 అమెరికాలో స్థానిక నియామకాలకు ప్రాధాన్యతే కారణం
Visaన్యూఢిల్లీ: ఈ సంవత్సరం హెచ్-1 వీసాలకు దరఖా స్తులను టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) తగ్గిం చింది. 2015 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వీసా లకు దరఖాస్తులు మూడో వంతు మాత్రమే ఉన్నాయి. దీనికి కారణం అమెరికాలో స్థానిక నియామకాలకు ప్రాధాన్యతనివ్వడమే.. యుఎస్‌లోని బి-స్కూల్స్, ఇంజినీరింగ్ క్యాంపస్‌లలో టిసిఎస్ నియామకాలను పెంచింది. అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడం, భారత్ నుంచి వచ్చే వారిపై పరి శీలన పెరగడంతో టిసిఎస్ ఈ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. అమెరికాలో 60 శాతం భారత్ ఐటి ఎగుమతి మార్కెట్ ఉండగా, అక్కడ కఠిన నిర్ణయాలు భారత్ టెక్కీలకు అవకాశాలు లేకుండా చేస్తున్నాయి. టిసిఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌లు హెచ్-1బి వీసాల ను తమ సంస్థల్లోకి మళ్లించుకుంటున్నాయన్న ఆరో పణలు రావడంతో ఈ కంపెనీలు ఈ చర్యలు చేపడుతు న్నాయి. ఇప్పటికే అమెరికాలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లకు ఈ కంపెనీలు శ్రీకారం చుట్టాయి. భారత్‌లో విజయవంతమైన పలు విధానాలనే ఇక్కడ కూడా అమలు చేస్తున్నామని, క్యాంపస్‌లలో నియామకాలు చేపట్టేందుకు అక్కడి కళాశాలలతో ఒప్పందం చేసు కుంటున్నామని టిసిఎస్ మానవ వనరుల విభాగం ఇవిపి అజయ్ ముఖర్జీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. అమెరికాలోని టాప్ బి-స్కూల్స్ నుంచి వందల సంఖ్యలో ఇంజినీరింగ్, ఎంబిఎ గ్యాడ్యుయేట్లను నియ మించుకుంటున్నామని ఆయన తెలిపారు. ఇవన్నీ వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయని, ప్రస్తుత సంవత్సరం మా వీసా దరఖాస్తుల సంఖ్య బాగా తగ్గిం దని అన్నారు. ఒక్క అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలి యా, సింగపూర్‌లలో కూడా పరిస్థితులు ప్రతికూలం గా మారడంతో పలు సంస్థలు తమ వ్యాపార విధా నాలను మార్చుకుంటున్నాయి. వచ్చే రెండేళ్లలో 10 వేల మంది అమెరికన్లను నియమించుకుంటామని ఇప్పటికే ఇన్ఫోసిస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా నిర్ణయాలే కాకుండా ఇతర కారణాలు కూడా ఐటీ రంగంలోకి ఉద్యోగాల కోతలకు కారణమవుతు న్నాయి. డిజిటైజేషన్, ఆటోమేషన్ కారణంగా ఇన్ఫో సిస్, కాగ్నిజంట్, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ ఐటి కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోతలు చూస్తామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో ఆందో ళన మొదలైంది. 150 బిలియన్ డాలర్ల దేశీయ ఐటీ పరిశ్రమ మందగమనం వైపు దారితీస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయా లు, ఇతర ప్రతికూల పరి స్థితుల నేపథ్యంలో భారత ఐటి దిగ్గజాలు అన్నీ ఈ ఏడాదిలో భారీఎత్తున ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. అదే సమ యంలో మరింత గా అమెరికన్లను నియమించుకునేందు కు సిద్ధమవుతున్నాయి. 2008 లో ఆర్థిక మందగమనం ఏర్పడినప్పుడు తొలగిం చిన ఉద్యోగుల కంటే ఇప్పుడు భారీగా ఉద్యోగాల కోతకు.. విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినీ వంటి కంపెనీలు రం గం సిద్ధం చేసుకుంటున్నాయి. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై తొలుత ఈ ప్రభావం పడనుందని, ఈ ఏడాది ద్వితీ యార్థంలో జూనియర్ ఉద్యోగుల తొల గింపు ఉంటుందని తెలుస్తోంది. కాగా పనితీరు అం చనా ప్రక్రియ ఆధారంగా వేలాది మంది ఉద్యోగులకు కంపెనీలు ఇప్పటికే పింక్ స్లిప్‌లను అందజేశాయి. అయితే కాస్ట్ కంటింగ్(వ్యయం తగ్గింపు)లో భాగంగా ఇది మరింతగా పెరిగే అవకాశ ముందని తెలుస్తోంది. అనేక మార్కెట్లలో రక్షణవాదం పెరుగుతున్న నేపథ్యం లో పలు కంపెనీలపై ఒత్తిడి నెల కొంది. అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో చేపడుతున్న కఠిన నిబంధన ఫలితంగా దేశీయ సాఫ్ట్ వేర్ ఎగుమతి సంస్థలకు వ్యాపారంలో ఎదురుగాలు లు మొదలయ్యాయి. కృత్రిమ మేధస్సు, రోబో టిక్ ప్రక్రియ ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు తక్కువ మానవ శక్తితో పనిని పూర్తి చేసేం దు కు సహకరిస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొత్త వ్యూహాలను పరిశీలిస్తున్నాయి. సంస్థలు సాంకే తిక పరి జ్ఞానం మార్పు వైపు ఆసక్తి చూపడంతో ఉద్యో గులపై ప్రభావం ఏర్పడుతోంది. జూనియర్ స్థాయి ఉద్యోగులు చేసే పనిని ఆటోమేషన్ వంటి రోబోటిక్ విధానాలతో చేయగల్గే పరిస్థితి వచ్చింది. శ్రామికశక్తి పునర్నిర్మాణం జరిగేంత వరకు ఇలాంటి హేతుబద్ధీకర ణ విధానం కొనసాగుతూనే ఉంటుందని నిపుణులు అంటున్నారు.