Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

హద్దులు దాటి అందాలొలికించింది

rejeena

కుల్‌ప్రీత్ సింగ్, రాశీఖన్నాతో పాటే టాలీవుడ్‌లోకి వచ్చిన రెజీనా టాప్ హీరోయిన్ కాలేకపోయింది. చివరికి కాస్త కిందకు దిగి తెలుగులో ఒకటి, రెండు సినిమాల్లో కాస్త గ్లామరస్‌గా కనిపించే ప్రయత్నం చేసింది. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో తమిళ్‌లో ఓ సినిమా చేసింది రెజీనా. ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే ఈ సినిమా ట్రైలర్ తాజాగా బయటకు వచ్చింది. ఒకప్పటి హీరో కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో తండ్రి, కొడుకులు ఇద్దరూ నటించడం విశేషం. ఇందులో గౌతమ్‌కు జోడీగా రెజీనా నటించింది. ఫన్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు విశాల్‌తో సినిమాలు చేసిన తిరు డైరెక్టర్. ఈ చిత్రంలో రెజీనా ఓ పాటలో రెచ్చిపోయి నటించింది. హద్దులు దాటి అందాలొలికించింది. ట్రైలర్‌లో ఈ పాట చూసిన యువకులు రెజీనా అందాలను చూసి మైమరచిపోతున్నారట. ఈ సినిమాలో గ్లామరస్‌గా నటించిన ఈ భామ మంచి హిట్‌ను అందుకోవాలని తహతహలాడుతోంది. ఎలాగైనా ఈ చిత్రంతో కోలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని రెజీనా కోరుకుంటోంది.

Comments

comments