Search
Saturday 21 July 2018
  • :
  • :

గడువు ముగిసింది

Register the details of the farmers insurance nominees

  అందరిక దృష్టిని ఆకర్షించి చర్చనీయాంశంగా మారిన యా దాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సి పల్ చైర్ పర్సన్ అవిశ్వాసానికి ముహూర్తం ఖరారైంది. చైర్ పర్సన్ లావణ్య శ్రీనివాస్‌పై అవి శ్వాసం ప్రవేశపె డుతూ టిఆర్‌ఎస్, బిజెపి, టిడిపి, సిపిఐఎం పార్టీల కు చెందిన 24మంది కౌన్సిలర్‌లు కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు 4న నోటీసు అందజేసిన విష యం విధితమే. అయితే కౌన్సిలర్లు ఇచ్చిన నోటీసు ను పరిశీలించిన అనంతరం నియ మ నిబంధనల మేరకు కలెక్టర్ శనివారమే కౌన్సిలర్ల కు ప్రతి నోటీసు జారీ చేశారు.  24న ఉ॥ 11గం॥ అవిశ్వా సానికి అనుమతినిస్తూ ఆ మేరకు కౌన్సిల్ సమా వేశం ఏర్పాటు చేయాలని   ఆదేశించారు.

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : ప్రతిష్టాత్మకమైన రైతు భీమా నామిని వివరాల నమోదుకు ప్రభుత్వం విధించిన గడువు నేటితో ముగియనుంది. తమ నామిని వివరా లు జూలై 10వ తేదీలోపు అందించాలని పదేపదే చెప్పినా రైతుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కానరాలేదు. పథకం ప్రవేశపెట్టి 35 గడువు విధించినా ఒక రోజు ము ందు సోమవారం వరకు మొత్తం 2,50,800 మంది రైతులు మాత్రమే సర్వే పూర్తి చేసుకున్నారు. జిల్లా వ్యా ప్తంగా ఇప్పటి వరకు 3,60,000 మంది రైతులు పట్టాదా రు పుస్తకాలు పొందగా అందులో గడువు ముగిసే నాటికి కేవలం 65శాతం మంది మాత్రమే నామిని వివరాలు అం దజేశారు. ఇంకా 35శాతం వరకు రైతులు తమ నామిని వివరాలు వ్యవసాయ విస్తరణాధికారులకు అందజే యాల్సి ఉంది. రైతు శ్రేయస్సు దృష్టా  ప్రభుత్వం ప్రవేశపెట్టిన  రైతుబంధు ద్వారా పెట్టుబడి సహాయం కింద చెక్కుల పంపిణీ, సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన ద్వారా పట్టాదారుపాసుపుస్తకాల పంపిణీ తదితర సంక్షేమ పథకాల్లో అనంతరం మరో అద్భుతమైన పథకం రైతు బీమా. అయినా  బీమా చేయించుకొని మీ బతుకులకు భరోసా కల్పిం చుకోవాలని ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించినా రైతులు అనుకున్న విదంగా ముందుకు రాలేదు. రై తుకు నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే రూ. 2271 ప్రీమియం చెల్లించి ఎస్‌ఐసి సౌజన్యంతో ప్రతి పాసు పుస్తకాలు పొందిన రైతుకు బీమా వర్తింపజేయాలని ప్రయత్నాలకు ఆది నుంచి మందకోడిగా కొనసాగింది. దీంతో ప్రభుత్వ విధించి గడువు జూలై 10 వరకు జిల్లా వ్యా ప్తంగా కేవలం 65శాతం మాత్రమే నామిని వివరాల సేకరణ కార్యక్రమం జరుగడం పరిస్థితి అద్దంపడుతోంది.  వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు, ప్రచార ప్రకటనలతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వివిద మార్గాల్లో ప్రచారం కల్పించినప్పటికీ రైతులు అనాసక్తి ప్రదర్శించారు. ఖరీఫ్ వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమైనందున బీమా పట్ల అవగాహన లేక కొంత, పట్టణ ప్రాం తాల్లో ఉండే వారు రైతు బంధు చెక్కులు తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇటు వైపు ముఖం చూపకపోవడం మరికొంత తోడై భీమా నామిని వివరాల నమోదు ప్రక్రియకు ఆటంకం కల్గించిందని అధికార యంత్రాంగం భావించింది. అ యినా వ్యవసాయ శాఖ అధికారులు తమ వంతు విస్త్రుత ప్రచారం కల్పించగా గడువుకు ఒకరోజు ముందు సోమవారం సాయంత్రానికి 2,50,000 మంది రైతుల నుంచి నామిని వివరాలు సేకరించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రైతుల వద్ద నుంచి నామిని వివరాలు సేకరిస్తూనే ఎల్‌ఐసి పోర్టల్‌లో వివరాల నమోదు ప్రక్రియను సమాంతరంగా కొనసాగిస్తున్నామని, అవసరమైతే ఈనెల 15వ తేదీ వరకు కూడా నామిని వివరాలు సేకరిస్తూనే అనుకున్న సమయానికి ఎల్‌ఎఐసి పోర్టల్‌లో పూర్తి నమోదు కార్యక్రమాన్ని ముగిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి ‘మన తెలంగాణ’తో మాట్లాడుతూ చెప్పారు. ప్రతి రోజు ఉదయం స మయంలో నామిని వివరాలు సేకరించడం, సాయంత్రం పోర్టల్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని మరింత విస్ర్తుతపరుస్తామని తెలిపారు.

Comments

comments