Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రిజిస్ట్రేషన్లు విప్లవాత్మకమైన మార్పుకు నాంది

 

Registrations emerge for  revolutionary change

జూన్ 2 నుంచి తహసీల్దార్‌లంతా రిజిస్ట్రార్‌లు
పైలెట్ ప్రాజెక్ట్‌గా రాయికల్‌లో సేవలు
జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

మనతెలంగాణ/రాయికల్: తెలంగాణ ప్రభుత్వం తహసీల్ కా ర్యాలయంలో రిజిస్ట్రేషన్‌లతో మరో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టిందని జగిత్యాల కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన రాయికల్ తహసీల్దార్ కా ర్యాలయంలో శనివారం ఆయన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పరికరాల పనితీరును అధికారుల ద్వారా అడిగి తెలుసుకొన్న ఆనంతరం విలేకరులతో మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం రై తులు, ప్రజలకు అందుబాటులోకి రిజిస్ట్రేషన్ సేవలను తెచ్చిందన్నారు. జూన్ 2 తర్వాత జిల్లా పరిధిలోని 14 మండలాల్లో త హసీల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పనులు చేపడతామని చెప్పా రు.జగిత్యాల పరిధిలో 18మండలాలుండగా ఇప్పటికే జగిత్యా ల,మల్యాల,కోరుట్ల, మెట్‌పెల్లిలో సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాలు ఉన్నాయని మిగతా మండలాలల్లో తహసీల్దార్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.అప్పటి నుంచి తహసీల్దార్‌లంతా రిజిస్ట్రార్‌లుగా మారతారని వివరించారు.రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక్కటి చొప్పున మ ండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి తహసీల్ కార్యాలయంలోనే భూ,ఆస్తులు,వివాహాలు,ఇతర రిజిస్ట్రేషన్‌లు చేపట్టేందుకు ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టిందన్నారు. రైతులకు నాణ్యమైన పారదర్శకమైన సేవలు అందజేయడానికి అందుబాటులోకి తహసీల్ కార్యాలయాలను రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మార్చిందని తెలిపారు.తహసీల్దార్ అందుబాటు లో లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ పనులు చేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తారని తెలిపారు. రాయిక ల్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసామని దీని పనితీరును ఆధారంగా మిగతా మండలాల అధికారులకు రాయికల్ తహసీల్ కార్యాలయంలోనే శిక్షణ కల్పిస్తామని చెప్పారు. భూ క్రయ, విక్రయాదారులు ఇరువురు తహసీల్ కార్యాలయానికి వచ్చి తమ రిజిస్ట్రేషన్‌లు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌లు చేసే విధానంపై ప్రభుత్వం అధికారులకు కరదీపిక అందజేసిందని చెప్పారు. రైతుబంధు పథకంలో ఏమైనా లోపాలు త లేత్తితే వాటిని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టుతామని రైతులు ఆ ందోళన చెందవద్దని తెలిపారు. ఈ మేరకు ప్రింటర్ కార్యాలయానికి వచ్చిందని చెక్కుల విషయం ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పెల్లి సబ్‌కలెక్టర్ గౌతంపొత్రు,జగిత్యాల ఆర్‌డిఒ నరేంధర్, జగిత్యా ల సబ్‌రిజిష్ట్రర్ రవీందర్‌రావు. ఈ జిల్లా మేనేజర్ మమత, ధరణి జిల్లా కో ఆర్డీనేటర్ మధు, తహసీల్దార్ పుప్పాల హన్మంతరెడ్డి, డిటిలు శశిధర్, వకీల్, ఆర్‌ఐ ప్రసాద్, జిల్లా రెవెన్యూఅధికారు ల సంఘం గౌరవ అధ్యక్షుడు హరి ఆశోక్‌కుమార్, విఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments