Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పాలమూరును పరుగెత్తించండి

డిండి, పాలమూరురంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల సహాయ పునరావాస చర్యలను వేగవంతం చేయాలి
అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు
కల్వకుర్తి ఎత్తిపోతలతో కొత్తగా లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని ప్రకటన

అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం 

Harish-rao

హైదరాబాద్: డిండి, పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన సహాయ, పునరావాస చర్యలు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. సచివాలయంలో బుధవారం నాడు సిద్ధిపేట, సూర్యాపేట, సిరిసిల్ల, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కాళేశ్వరం ప్రాజెక్టు ఇఎన్‌సి హరిరామ్, ఇరిగేషన్ ఓఎస్‌డి శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. డిండి, పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దీంతో పాటు మెరుగైన పునరావాస ప్యాకేజిని అందించాలని సూచించారు. 2013 ఆర్ అండ్ ఆర్ యాక్టు కన్నా మిన్నగా ప్రాజెక్టులో ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారికి పునరావాస ప్యాకేజి ఉండాలన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, అనంతగిరి, రంగనాయక సాగర్, మేడారం రిజర్వాయర్ల పరిధిలో భూసేకరణ పనులు పూర్తిచేయాలని, వీటి కింద ఇళ్లు కోల్పోయిన వారికి మెరుగైన సహాయ, పునరావాసం కల్పించాలని ఆదేశించారు. పరిహారం నిమిత్తం ఇప్పటికే విడుదల చేసిన నిధులను నిర్వాసితులకు వెంటనే చెల్లించాలని ఆదేశించారు.  కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా గత ఏడాది 2.5 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చామని, ఈ ఏడాది కొత్తగా మరో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరిస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ ఏడాది 3.60 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. కల్వకుర్తి పరిధిలో భూసేకరణ పనులు పూర్తిచేయాలన్నారు. ఇందుకు అవసరమైన రూ.13 కోట్లను రెండు, మూడు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. మూసీ ప్రాజెక్టు కింద సైతం ఈ ఏడాది కొత్తగా 26 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీలోగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా చూడాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.

Comments

comments