Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అవయవదానంతో పునర్జన్మ

Organ-donor-image

అవయవదానంపై ప్రజలో పెరిగి అవగాహన 2016తో పోలిస్తే …2017లో పెరిగిన దాతలు

మన తెలంగాణ/సిటీబ్యూరో: అవయవదానంపై ప్రజల్లో రోజురోజుకూ అవగాహన పెరుగుతోంది. మరణానికి చేరువైన వారికి పునర్జన్మ అందించవచ్చనే విషయం ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, దీంతో అవయవదానానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలుష్య ప్రభావమో…కలుషిత ఆహారమో..కారాణమేదైనా ఇటీవలి కాలంలో అవయవాల పనితీరు మందగిస్తున్న కేసులు పెరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజులు గడిచే కొద్ది ఈ అవయవాలు పాడైపోతుండటంతో …పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ అవయవదానం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మూత్రపిండాలు, కాలేయం, గుండె, క్లోమ గ్రంథి తదితర అవయవాలు చెడిపోవడంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు వీరి పాలిట వరంగా మారాయి. అవయవాలు చెడిపోవడంతో మృత్యువు సమీపానికి వెళ్లిన వారు ఎంతో మంది అవయవ మార్పిడి శస్త్రచికిత్సతో నేడు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులకు వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చి అవయవాలను దానం చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే, గతంలో అవయవదానంపై ఉన్న అపోహాల కారణంగా చాలామంది ముందుకొచ్చేవారు కాదు. ఇటీవలి కాలంలో ప్రజల్లో అవగాహన పెరగడంతో అవయవదానానికి ముందుకొస్తున్నారని జీవన్‌ధాన్ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారుల తెలుపుతున్నారు. గత ఏడాది 182 మూత్రపిండాలు, 1 00 కాలేయాలు, 15 గు ండె, 90 కార్నియాలు, 18 గుండె కవాటాలు, 2 ఊపిరితిత్తులు, 4 క్లోమ గ్రంథులను పలువు రు జీవన్‌ధాన్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వా రా బాధితులకు అమర్చారు. 2016 జనవరి నుంచి డిసెంబర్ వరకు 411అవయవ మా ర్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి.

2017 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కిడ్నీలు 219, లివర్ 137, గుండె 31, కార్నివార్ 168, ఊపిరితిత్తులు 2, ప్యాంక్రియాస్ 1, మొత్తం 558 అవయవాలను సర్జరీల ద్వారా బాధిత రోగులకు అయర్చడం జరిగింది. ఇక జీవన్‌ధాన్‌లో లివర్ 1574, కిడ్నీలు 1690, గుండె 105, ఊపిరితిత్తులు 22, ప్యాంక్రియాస్ 7 అవసరం ఉందని వివిధ ప్రాంతాలకు చెందిన రోగులు నమోదు చేసుకున్నారు. గతంతో పోలిస్తే అవయవదానంపై ప్రజల్లో చాలా వరకు అవగాహన పెరిగిందని జీవన్‌ధాన్ హెల్త్‌కేర్ ట్రస్ట్ అధికారులు పేర్కొంటున్నారు.

Comments

comments