Home సినిమా డ్యాన్స్ టీచర్‌గా రెజీనా

డ్యాన్స్ టీచర్‌గా రెజీనా

 

‘ఎస్‌ఎంఎస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ రెజీనా. ఇటీవల ఆమె ‘అ..!’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత ఆమె తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఈ భామ తమిళ, హిందీ చిత్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తమిళంలో ‘చంద్రమౌళి’ సినిమాలో అందాలు ఆరబోసి యూత్‌ను అలరించింది.

ఇక తాజాగా అరవింద్ స్వామి ‘కల్లపార్ట్’ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి రాజపాండి దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్ స్వామితో కలిసి ఈ చిత్రంలో నటిస్తుండడంతో ఎంతో ఆనందంగా ఉందని రెజీనా చెప్పింది. ఈ సినిమాలో ఆమె డ్యాన్స్ టీచర్‌గా కనిపించనుంది.

Rejina act as Dance Teacher!