Home తాజా వార్తలు 34 టేక్స్ తీసుకున్నా…

34 టేక్స్ తీసుకున్నా…

Regina

హరీష్‌శంకర్ దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా దిల్‌రాజ్ నిర్మించిన చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరోయిన్ రెజీనాతో ఇంటర్వూ విశేషాలు…
అమాయకురాలైన అమ్మాయిగా…
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో సీత అనే పాత్ర పోషించాను. ఆమె పెద్ద ఫ్యామిలీలో అందరితో అనుబంధాల మధ్య పెరిగిన అమ్మాయి. బేసికగా తను చాలా అమాయకురాలు. కానీ బయటకు అలా కనిపిస్తే ఎవరైనా మోసం చేస్తారని అమాయకంగా కనిపించకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటుంది.
సోషల్ మీడియా సమస్యలతో…
కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీ ఇది. సినిమాలో హీరో కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే అమెరికా వెళ్తాడు. హీరోయిన్ కొన్ని అనివార్య కారణాల వల్ల అమెరికా వెళ్తుంది. తనకొక సమస్య రావడంతో డబ్బు ఇస్తే సమస్యను పరిష్కరిస్తానని హీరో చెబుతాడు. ఈ అంశాలపై సినిమా నడుస్తుంటుంది. సోషల్ మీడియా వలన ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ సినిమాలో చూపించాం.
వల్గర్‌గా కనిపించను….
నా నిజ జీవితంలో గ్లామరస్‌గా ఉండడానికి ఇష్టపడను. కేవలం జీన్స్, టీషర్ట్ మాత్రమే వేసుకుంటాను. నా మొదటి సినిమా ఎస్‌ఎంఎస్‌లో రెజీనా ఇంకా గ్లామర్‌గా ఉండే బావుండేదని అన్నారు. అప్పటినుంచి కొంచెం గ్లామర్‌గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమాలో హరీష్‌శంకర్ నన్ను కాస్త గ్లామర్‌గానే చూపించారు. కానీ వల్గర్‌గా అయితే ఎక్కడా కనిపించను. సినిమాలో గ్లామర్ అనేది క్యారెక్టర్‌లో లింక్ అయి ఉంటుంది.
అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తా…
కాస్టూమ్స్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాను. హెయిర్‌స్టైల్, మేకప్… ఇలా చాలా విషయాల్లో కేర్ తీసుకుంటాను. అందంగా కనిపించాలంటే హార్ట్‌వర్క్ చేయాలి. ఈ కాస్టూమ్స్ వద్దు అని నేను చెప్పిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేనొక సెలబ్రిటీని. కాబట్టి నన్ను చూసేవారు, ఫాలో అయ్యేవారు చాలామంది ఉంటారు. కాబట్టి నేను ఓ రేంజ్, ఇమేజ్‌ను కొనసాగించాలి.
రొమాంటిక్ సీన్స్ ఉంటాయి…
‘పిల్లా నువ్వులేని జీవితం నుండి నేను, సాయిధరమ్‌తేజ్ మంచి స్నేహితులం. తను చాలా మెచ్యూర్డ్ యాక్టర్. ఆ సినిమాలో మా ఇద్దరికీ ఎలాంటి రొమాంటిక్ సీన్స్ ఉండవు. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో అన్ని రకాల ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. షూటింగ్ రోజు ఏం చేయాలో తేజకు, నాకు క్లారిటీ ఉంటుంది. డైరెక్టర్ సీన్ చెప్పగానే రిహార్సల్స్ చేసి పర్ఫార్మ్ చేసేవాళ్లం. అంతేకానీ రొమాంటిక్ సీన్స్‌లో నటించాలని ఎక్కువగా ఆలోచించేవాళ్లం కాదు.
నాకు ఏడుపొచ్చింది…
అందరూ యాక్టర్స్ జాబ్ చాలా ఈజీ అనుకుంటారు. కానీ నటించడమంటే అంత సులభం కాదు. న్యూజెర్సీలోని ఒక ప్రాంతంలో 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో నది దగ్గర షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ వాతావరణంలో నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. కానీ నా డైలాగ్స్ గుర్తుంచుకొని పర్ఫార్మ్ చేయాలి. నాకు ఏడుపొచ్చింది. అయినా అదుపు చేసుకున్నాను. దాదాపుగా ఆ సన్నివేశం కోసం 34 టేక్స్ తీసుకున్నాను.
నెక్స్ ప్రాజెక్ట్…
సందీప్‌కిషన్‌తో తమిళ్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాను. అది డిసెంబర్‌లో లేదా జనవరిలో రిలీజ్ అవుతుంది. కొన్ని ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్నాయి.