Home ఎడిటోరియల్ బాంధవ్యానికి ప్రతీక ‘రాఖీ పౌర్ణమి’

బాంధవ్యానికి ప్రతీక ‘రాఖీ పౌర్ణమి’

Rakhiమన సమాజంలో పరస్పర స్నేహం, శ్రద్ధాకేంద్రాల రక్షణ చేసేందుకు సర్వదా సిద్ధంగా ఉండాలనే భావనను జాగృతం చేయడానికి మన పూర్వీకులు అనేక పర్వదినా లను ప్రవేశ పెట్టారు. అందులో ‘రక్షాబంధన్’ ఒక ప్రముఖ పర్వదినం. మన సమాజంలో వర్ణం, కులం, ప్రాంత బేధాలతో సంబంధం లేకుం డా స్నేహపూర్వక వాతావరణంలో అన్నా, చెల్లెళ్లు అను బంధా నికి ప్రతీకగా జరుపు కునే ఉత్స వమే రాఖీపౌర్ణమి. రక్షా బంధన్ శ్రావణ పౌర్ణమి రోజున వస్తుంది. నిత్య జీవితంలో ఎవరి కి వారం మన పనులలో నిత్యం ఒత్తిడికి గురై అనేక పండుగలను జరుపుకోలేక పోతున్నాము. “ధర్మో రక్షతి రక్షితః’ ‘ధర్మ స్వభావమది. మనం ధర్మాన్ని రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధార్మికులై ధర్మ సంస్థాపనకు స్థిర సంకల్పులై ఉన్న ప్రజలు ఒకటై ధర్మ రక్షణకు నిల్చున్ననాడు ఆ ధర్మం అట్టివారిలో ప్రాణం నింపి, జీవం పోసి, వారిని విజేతలుగా చేస్తుంది. నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష ‘మనం దరం సమా జానికి, ధర్మానికి రక్ష అంటూ ఒకరి కొకరం రాఖీలు కట్టుకుం టాము. దూర ప్రదేశాలలో వున్న చెల్లెళ్లు, తోబుట్టువులు తమ సోదరు లకు రాఖీలు కట్టేందుకు బయలు దేరి, రాఖీలు కట్టి ‘సోదరుల నోటిని తీపి చేస్తారు. సోదరులు కూడా చెల్లెళ్లు, అక్కలపై ఉన్న అభిమానంతో తోచిన విధంగా బహు మతులు, నగదు అందచేయడం ఆనవా యితీ. దూరపు సోదరులకు, వరుసకు సోదరులైన వారికి కూడా రాఖీలు కడతారు. కనీసం సంవత్స రానికి ఒకమారైనా సోదరు లను చూసే అవ కాశం వారి తోబుట్టువుల కు కలుగుతుంది. రక్షా బంధన్‌కి ‘జంధ్యాల పౌర్ణ మి’ అనే పేరు కూడా ఉంది. ఉపన యన సంస్కారం ఉన్న వారు శ్రావణ పూర్ణిమ నాడు విధిగా యజ్ఞోప వీతం ధరిస్తారు. యజ్ఞోపవీతానికి జంధ్యం అని జన సామా న్యంలో పేరుంది. అందుకే జంధ్యాల పౌర్ణమిగా చెప్పారు. స్త్రీలకి స్త్రీలు పురుషులకు పురుషులు కూడా కట్టుకోవచ్చు. ఇలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశం ఏమిటంటే స్థితికారకుడైన శ్రీహరి జన్మ నక్షత్రం శ్రవణం అనేది నమ్మకం. నిండుగా ఉండే ఈ శ్రావణ పౌర్ణమి రోజు నేను ఫలాన వారికి రక్షణ కోసం కడుతున్నాను. కాబట్టి నిరంతరం లోకాన్ని రక్షిస్తూ ఉండాలనే తపన గల శ్రీహరి అనుగ్రహం నామీద ప్రసరించేనాడిగా నేను ఉండాలని అర్థం చేసుకోవాలి. ఈ రక్షా బంధనానికి, ప్రత్యక్ష సాక్షి సూర్యుడు. అందుకే మధ్యాహ్న సమయంలో రక్షని కడతారు.
(ఆగస్టు 18వ తేదీ రాఖీపౌర్ణమి సందర్భంగా)
– కామిడి సతీష్‌రెడ్డి(టీచర్), వరంగల్‌జిల్లా
9848445134