Home తాజా వార్తలు ప్రేమికులపై బంధువుల దాడి..

ప్రేమికులపై బంధువుల దాడి..

Lovers

జమ్మికుంట: గత నెల సికింద్రాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో ప్రేమజంట పెళ్లి చేసుకుంది. ఇది జీర్ణించుకోలేని అమ్మాయి తరపున బంధువులు ప్రవీణ్‌పై దాడి చేశారు. ఈ సంఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. మహబుబాబాద్ అమ్మాయి, మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన ప్రవీణ్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెద్దలను ఎదురించి ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. దీంతో అమ్మాయి తరపున బంధువులు ప్రవీణ్‌పై తీవ్రంగా దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లరు. గ్రామస్థులు ఒక వహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు, అందులో ఉన్న ఐదుగురిని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడ్డా ప్రవీణ్‌ను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.